Figs Benefits: వేసవిలో అంజీర్ పండ్లని తినొచ్చా.. నిపుణుల అభిప్రాయం ఏంటంటే..?

Can You Eat Figs in Summer Know the Opinion of Medical Experts
x

Figs Benefits: వేసవిలో అంజీర్ పండ్లని తినొచ్చా.. నిపుణుల అభిప్రాయం ఏంటంటే..?

Highlights

Figs Benefits: ఏ సీజన్‌లో దొరికే పండ్లు ఆ సీజన్‌లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Figs Benefits: ఏ సీజన్‌లో దొరికే పండ్లు ఆ సీజన్‌లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవి కాలంలో డ్రై ఫ్రూట్స్‌ని ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి పోషకాహార లోపాన్ని తీరుస్తాయి. వీటిలో ముందుగా అత్తి పండ్ల గురించి మాట్లాడుకోవాలి. భారతదేశంలో వీటిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. వేసవి కాలంలో ప్రజలు అంజూర పండ్లను ఎంతో ఉత్సాహంగా తింటారు. అయితే ఎండు అత్తి పండ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎండు అత్తి పండ్లలో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్య పరంగా ఇవి చాలా మంచివి. వీటిలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు K, B6 సమృద్ధిగా లభిస్తాయి. ఇది కాకుండా అత్తి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అత్తిపండ్లు సహజ చక్కెరలా ఉపయోగపడుతాయి. ఎండు అత్తి పండ్లను ఒక రుచికరమైన, పోషకమైన చిరుతిండిగా చెప్పవచ్చు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవిలో వీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

నిల్వ చేయడం కష్టం

అంజీర్ పాడైపోయే పండు. ఇవి వేడిని తట్టుకోలేవు. సహజ చక్కెర కిణ్వ ప్రక్రియకు దారితీస్తుంది. ఈ కారణంగా త్వరగా పాడైపోతాయి. వేసవి నెలల్లో అత్తి పండ్లను నిల్వ చేయడం కొంచెం కష్టమైన పని చెప్పవచ్చు.

జీర్ణ సమస్యలు

ఎండు అత్తి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో ఎండిన అంజీర పండ్లను ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు, విరేచనాలు ఎదురవుతాయి. వేసవిలో ఎండిన అత్తి పండ్లకు బదులుగా తాజా అత్తి పండ్లను లేదా ఇతర హైడ్రేటింగ్ పండ్లను తినడం మంచిది. ఎండు అత్తి పండ్లను తింటే మాత్రం పరిమితంగా తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories