Health Tips: చలికాలంలో పెరుగు తినొచ్చా.. తింటే ఏమవుతుంది..!

Can you Eat Curd in Winter? What will happen if you Eat it?
x

Health Tips: చలికాలంలో పెరుగు తినొచ్చా.. తింటే ఏమవుతుంది..!

Highlights

Health Tips: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు కానీ, మజ్జిగ కానీ తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి.

Health Tips: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు కానీ, మజ్జిగ కానీ తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి.అంతే కాదు పెరుగు అద్భుతమైన ప్రోబయోటిక్ కూడా. కడుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండేందుకు పెరుగు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. పెరుగులో కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్లు బి2 వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి అనేది అందుతుంది. దీంతో ఇతర రకాల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. అయితే శీతా కాలంలో జలుబు చేస్తుందని చాలా మంది దూరం పెడతారు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

శీతాకాలంలో కూడా పెరుగు తినడం వల్ల జీర్ణ క్రియ అనేది సవ్యంగా జరుగుతుంది. దీంతో మల బద్ధకం సమస్య ఉండదు. కడపులో నొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పొట్ట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

పెరుగులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు మెండుగా ఉంటుంది. క్రమం తప్పకుండా పెరుగు తీసుకుంటే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా ఉంటాయి. అంతే కాకుండా పెరుగు తీసుకోవడం వల్ల అధిక రక్త పోటు కూడా అదుపులోకి వస్తుంది.

శీతాకాలంలో బరువు తగ్గాలి అనుకునే వారు పెరుగును హ్యాపీగా తీసుకోవచ్చు. పెరుగులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

శీతా కాలంలో పెరుగును తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బావుంటుంది. చర్మంపై మచ్చలు, అలర్జీ సమస్యలు, పొడి బారడం వంటివి రాకుండా ఉంటాయి. క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవడం వల్ల చర్మం కాంతి వంతంగా తయారవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories