Wellness: బరువులు మోస్తే చర్మం మెరుస్తుందా? డాక్టర్లు చెబుతున్న ఈ విషయాలు వింటే షాక్ అవుతారు..!

Wellness: బరువులు మోస్తే చర్మం మెరుస్తుందా? డాక్టర్లు చెబుతున్న ఈ విషయాలు వింటే షాక్ అవుతారు..!
x
Highlights

wellness: బరువులు మోస్తే చర్మం మెరుస్తుందా? వింతగా అనిపించినా.. నిజమే అంటున్నారు వైద్యులు. నిత్యం వ్యాయామం చేయడం, వెయిట్ లిఫ్టింగ్ వల్ల మన ఆరోగ్యం మెరుగుపడటమే కాదు చర్మం కూడా మెరుస్తుందని చెబుతున్నారు.

wellness : మనం బాగుండాంటే మన ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించాలి. అంతర్గత ఆరోగ్యంతోపాటు బాహ్యాంగా కూడా అందంగా కనిపించాలంటే వ్యాయామం, పౌష్టికాహారం, యోగా, నడక, వంటివి చేయాలని నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు బరువులు ఎత్తడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. బరువులు ఎత్తడం వల్ల గుండె మాత్రమే కాదు, మెదడు, మానసిక ఆరోగ్యంతోపాటు చర్మం మెరుస్తుందట. బరువులు ఎత్తడం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి ఫిట్నెస్ ఔత్సాహికులు వివరించారు. 20 కిలోల బార్‌బెల్‌ను ఎత్తడం మీ కండరాలు బలంగా ఉండటమే కాదు..మీ చర్మం తళతళ మెరిసిపోవడం ఖాయమని చెబుతున్నారు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మన చర్మం ఆరోగ్యంగా ఉంటుందని ది ఎస్తెటిక్ క్లినిక్స్‌లో కాస్మెటిక్ డెర్మటాలజిస్టులు అంటున్నారు. శారీరక శ్రమ అనేది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని..ఇది మృదువైన చర్మానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. నిత్యం వ్యాయామం చేడయం వల్ల ఒత్తిడిని తగ్గించడమే కాదు.. డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ వంటి మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది మీ చర్మానికి, మొత్తం ఆరోగ్యానికి అందించే బహుమతి వంటింది అంటున్నారు.

కేవలం బరువులు ఎత్తడం మాత్రమే కాదు.. చర్మ ఆరోగ్యానికి కావాల్సిన ఆక్సిజన్, పోషకాలను అందించడం ద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. మెరుగైన రక్త ప్రసరణ అనేది చర్మం నుండి టాక్సిన్స్, సెల్యులార్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తుంది. అంతేకాకుండా, శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించడంతోపాటు ముఖంపై మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తుందని తెలిపారు.

ముఖంపై ముడతలు తొలగిస్తుంది:

శారీరక శ్రమ అనేది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మానికి ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ ద్వారా కండరాలను నిర్మించడంతోపాటు చర్మాన్ని అందంగా మారుస్తుంది. ముఖంపై వచ్చే వ్రుద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.

జిమ్ మొటిమలకు ఇలా చెక్:

చాలా మంది గంటల తరబడి జిమ్ లో వ్యాయామాలు చేస్తుంటారు. ఈ సమయంలో చెమట రూపంలో వారి శరీరం అంతా తడిసిపోతుంది. ముఖ్యంగా చర్మంపై జిడ్డు పేరుకుపోతుంది. ఇది కాస్త మొటిమలకు కారణం అవుతుంది. అయితే వెయిట్ లిఫ్టింగ్ కు మొటిమలకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు నిపుణులు. సాధారణంగా వర్కవుట్‌ల సమయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని చెబుతున్నారు.

వ్యాయామం చేసిన వెంటనే తలస్నానం చేయండి:

జిమ్ నుంచి వచ్చిన వెంటనే చెమట, బ్యాక్టీరియాను తొలగించడానికి స్నానం చేయడం తప్పనిసరి.

శుభ్రమైన వ్యాయామ దుస్తులను ధరించండి:

చర్మం నుండి తేమను తొలగించే తాజా, శ్వాసక్రియకు అనుకూలమైన బట్టలు ఉపయోగించండి.

మీ ముఖాన్ని చేతులతో తాకడం మానుకోండి:

వ్యాయామం చేస్తున్న సమయంలో పదే పదే ముఖాన్ని చేతులతో తాకకూడదు. ఎందుకంటే మీకు చేతులకు ఉండే బ్యాక్టీరియా మీ ముఖానికి అంటుకుంటుంది.

శుభ్రమైన టవల్ ఉపయోగించండి:

చేతులకు బదులుగా శుభ్రమైన, మృదువైన టవల్‌తో చెమటను తుడవండి.

హైడ్రేటెడ్‌గా ఉండండి:

టాక్సిన్స్‌ని బయటకు పంపడానికి, మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగండి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.


Show Full Article
Print Article
Next Story
More Stories