కర్పూరం హారతికి మాత్రమే కాదు ఈ సమస్యలకి దివ్య ఔషధం.. ఏంటంటే..?

Camphor a Divine Remedy for These Health Problems | Health Care Tips
x

కర్పూరం హారతికి మాత్రమే కాదు ఈ సమస్యలకి దివ్య ఔషధం.. ఏంటంటే..?

Highlights

Camphor: సాధారణంగా పూజ గదిలో హారతి సమయంలో కర్పూరంని ఉపయోగిస్తారు...

Camphor: సాధారణంగా పూజ గదిలో హారతి సమయంలో కర్పూరంని ఉపయోగిస్తారు. ఇంట్లోని వాస్తు దోషాలను, ప్రతికూలతను తొలగించే శక్తి కర్పూరానికి ఉందని నమ్ముతారు. ఈ కారణంగా కర్పూరాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే కర్పూరంలో మీ శారీరక సమస్యలన్నింటినీ దూరం చేసే గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి.

కానీ ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిజానికి కర్పూరం యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి శరీరం, మనస్సు రెండింటినీ ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి.

కర్పూరం కండరాల నొప్పిని తగ్గించడంలో పనిచేస్తుంది. ఇందుకోసం ఆవనూనెలో కర్పూరం వేసి శరీరానికి క్రమం తప్పకుండా మసాజ్ చేయాలి. దగ్గు విషయంలో కూడా ఈ నూనెని మీ ఛాతీ, వెనుకకు మసాజ్ చేయాలి. చాలా విశ్రాంతి పొందుతారు. మీరు ఆవాలకు బదులుగా నువ్వుల నూనెను కూడా ఉపయోగించవచ్చు.

మరోవైపు వేడి నీటిలో కర్పూరం వేసి ఆవిరి తీసుకోవడం వల్ల జలుబు విషయంలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. చర్మంపై చాలా మచ్చలు ఉంటే కొబ్బరి నూనెలో కర్పూరాన్ని మిక్స్ చేసి చర్మానికి క్రమం తప్పకుండా రాసుకోవాలి. దీంతో చర్మంలోని మచ్చలు తొలగిపోయి చర్మం శుభ్రంగా మారుతుంది. కానీ చర్మం జిడ్డుగా ఉంటే నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే చేయాలి.

కర్పూరాన్ని కొబ్బరినూనెలో కలిపి జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోయి జుట్టు నల్లగా మారుతుంది. కర్పూర పరిమళం మనసుకు ప్రశాంతతనిస్తుంది. మీకు ఎక్కువ ఒత్తిడి ఉంటే కర్పూరాన్ని ఒక పాత్రలో ఉంచి గదిలో పెట్టండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది మంచి అనుభూతి పొందుతారు.

రాత్రిపూట మంచి నిద్ర కూడా వస్తుంది. తలనొప్పి వస్తే కర్పూరం, శుంఠి, తెల్ల చందనం సమపాళ్లలో గ్రైండ్ చేసి నుదుటిపై రాసుకోవాలి. కాసేపు పడుకుంటే రిలాక్స్‌గా అనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories