Bone Health: ఈ పదార్థాలు తింటే ఎముకలు గుళ్ల.. ఈ రోజు నుంచి దూరంగా ఉండండి..!

Bones Will Be Damaged If These Substances Are Eaten Stay Away From Today
x

Bone Health: ఈ పదార్థాలు తింటే ఎముకలు గుళ్ల.. ఈ రోజు నుంచి దూరంగా ఉండండి..!

Highlights

Bone Health: ఎముకలు బలంగా ఉంటేనే మనిషి ధృడంగా ఉంటాడు. కానీ నేటికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎముక సాంద్రత గట్టిగా ఉండడం లేదు.

Bone Health: ఎముకలు బలంగా ఉంటేనే మనిషి ధృడంగా ఉంటాడు. కానీ నేటికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎముక సాంద్రత గట్టిగా ఉండడం లేదు. దీంతో చిన్న చిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగి కట్టుకట్టించుకుంటున్నారు. ఎముకలు బోలుగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పోషకాహారం తీసుకోకపోవడం, రోజు వ్యాయామం చేయకపోవడం వల్ల ఎముకలు గుళ్లగా మారుతాయి. ఆహారంలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి వంటి పోషకాలు ఉండాలి. ఇవి ఎముకలను గట్టిగా మారుస్తాయి. అలాగే ఎముకలకు హాని కలిగించే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

తీపి పదార్థాలు

ఏదైనా అతిగా తింటే శరీరానికి హాని కలుగుతుంది. అదే విధంగా అధిక మోతాదులో చక్కెర పదార్థాలు తినడం వల్ల ఎముకల సాంద్రత దెబ్బతింటుంది.

ఉప్పు పదార్థాలు

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఎముకలు వీక్‌గా మారుతాయి. ప్రజలు ప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇందులో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇది ఎముకలకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది.

ఐరన్‌

ఐరన్‌ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలో ఐరన్ అధికంగా ఉంటే కాల్షియం బయటకు వెళ్లిపోతుంది. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారుతాయి.

సోడా, శీతల పానీయాలు

ప్రజలు సోడా తాగడానికి చాలా ఇష్టపడతారు. కానీ ఇందులో అస్పర్టమే, ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి కాల్షియంను గ్రహించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. తద్వారా ఎముకలకు హాని కలుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories