Health Tips: చలికాలంలో ఎముకల సమస్యలు పెరుగుతాయి.. ఈ నివారణ పద్దతులు అనుసరించండి..!

Bone Problems Increase in Winter Follow these Remedies
x

Health Tips: చలికాలంలో ఎముకల సమస్యలు పెరుగుతాయి.. ఈ నివారణ పద్దతులు అనుసరించండి..!

Highlights

Health Tips: చలికాలంలో ఎముకల సమస్యలు పెరుగుతాయి.. ఈ నివారణ పద్దతులు అనుసరించండి..!

Health Tips: చలి పెరిగింది. దీంతో అనేక వ్యాధుల ప్రమాదం పెరిగినట్లే . ముఖ్యంగా కీళ్ల నొప్పులు తీవ్రమైన సమస్య ఇది ఏ వయస్సువారినైనా ప్రభావితం చేస్తుంది. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల సిరలు ముడుచుకుపోతాయి. విటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకల నొప్పి పెరుగుతుంది . ఈ పరిస్థితిలో ప్రజలు ఎముకల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సమస్య యువతలో కూడా కనిపిస్తోంది.

చలికాలంలో సూర్యరశ్మి కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. దీని వల్ల శరీరానికి విటమిన్ డి సరిగా అందదు. దీంతో ఎముకల సమస్య ఏర్పడుతుంది. రోజంతా కూర్చోవడమే పనిగా పెట్టుకున్న వారికి ఈ సమస్య ఎక్కువైపోతుంది. ఎక్కువ గంటలు కంప్యూటర్‌లో పనిచేసే వారికి కీళ్ల నొప్పులు మొదలవుతాయి. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎముకలు దృఢత్వం పెరిగి కీళ్ల నొప్పులు మొదలవుతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే పనిలో విరామం తీసుకోవడం తప్పనిసరి. కూర్చున్నప్పుడు మీ భంగిమ సరిగ్గా ఉందో చూసుకోవాలి.

ఉదయం నడక

రోజూ ఉదయపు నడక వల్ల శరీరం ప్రయోజనం పొందుతుంది. అన్ని వయసుల వారు ఉదయం నడకకు వెళ్లాలి. ప్రతిరోజూ కనీసం రెండు మూడు కిలోమీటర్లు నడవడానికి ప్రయత్నించాలి.

కాల్షియం, విటమిన్ డి

శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే ఎముకలు పెళుసుగా మారుతాయి. బాడీ కాల్షియం గ్రహించదు. సూర్యరశ్మిని తీసుకోకపోతే విటమిన్ డి లోపం వచ్చే ప్రమాదం ఉంది. అందుకు ఈ మాత్రలు తీసుకోవాలి.

ఆహారంపై శ్రద్ధ

ఆహారం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. తగినంత మొత్తంలో ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. పాలలో విటమిన్ డి మంచి మొత్తంలో ఉంటుంది.

నూనె మసాజ్

వేడి నూనెతో మసాజ్ చేయడం వల్ల ఎముకలకు మేలు జరుగుతుంది. ఇది ఎముకలకు వేడిని ఇవ్వడంతోపాటు కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తుంది. రాత్రి పడుకునే ముందు మసాజ్ చేయడం చాలా మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories