Hemophilia Disease: దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టడం లేదా.. మీరు ఈ వ్యాధికి గురయ్యారని అర్థం..!

Blood Clots when you get hit or find out if you Have Hemophilia
x

Hemophilia Disease: దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టడం లేదా.. మీరు ఈ వ్యాధికి గురయ్యారని అర్థం..!

Highlights

Hemophilia Disease: మన శరీరంపై ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వెంటనే రక్తం వస్తుంది కొద్దిసేపటికి అది గడ్డ కడుతుంది. కానీ కొంతమందికి దెబ్బతగిలితే రక్తం గడ్డకట్టదు.

Hemophilia Disease: మన శరీరంపై ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వెంటనే రక్తం వస్తుంది కొద్దిసేపటికి అది గడ్డ కడుతుంది. కానీ కొంతమందికి దెబ్బతగిలితే రక్తం గడ్డకట్టదు. కంటిన్యూస్‌ గా బయటికి వస్తూనే ఉంటుంది. దీనివల్ల వారు బాడీలోని రక్తం మొత్తం కోల్పోయి చావుకు దగ్గర వుతారు. ఇలాంటి పరిస్థితిని హిమోఫిలియా అంటారు. ఇది ఎక్కువగా జన్యులోపం వల్ల వస్తుం ది. దీనిపై చాలామందికి అవగాహన లేదు. ఈ రోజు దీని లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం.

'50 ఏళ్లుగా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా' అనే స్వచ్ఛంద సంస్థ హిమోఫిలియా బాధితు లకు సేవలందిస్తోంది. ప్రపంచంలోని మొత్తం 140 దేశాల్లో ఈ సంస్థ పని చేస్తోంది. దీనికి ప్రపం చ ఆరోగ్య సంస్థ ( WHO ) ద్వారా అధికారిక గుర్తింపు కూడా ఉంది. ఈ సంస్థ మన దేశంలో 60 సొసైటీలు ఏర్పాటు చేసి సేవలందిస్తోంది. హిమోఫిలియా సొసైటీ హైదరాబాద్' పేరుతో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఖరీదైన మందులను తక్కువ ధరకు అందిస్తోంది.

హీమోఫిలియా అనేది రక్తసంబంధిత జన్యులోప వ్యాధి. రక్తంలో సహజంగా ఉండాల్సిన ఫ్యాక్టర్ 7, 8, 9లో ఏదో ఒకటి లోపించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఫ్యాక్టర్ లోపాలను బట్టి దాన్ని మైల్స్, మోడరేట్, సీనియర్ అని మూడు భాగాలుగా విభజిస్తారు.హీమోఫిలియాను నయం చేసే మందును. 'యాంటీ హిమోఫిలియా ఫ్యాక్టర్' అంటారు. ఈ మందు మన దేశంలో అందుబాటులో లేదు. ఇతర దేశాల నుంచి ఈ మందును దిగుమతి చేసుకోవాలి. వీటి ధరలు అధికంగా ఉంటా యి. వ్యాధి తీవ్రతను బట్టి రూ.10వేల నుంచి రూ.7లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెపటైటిస్-ఎ, బికి చికిత్స తీసుకోవాలి. ఆస్పిరిన్, బ్రూఫిన్ వంటి మందులు వాడకం తగ్గించాలి. గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి. మెడికల్ ట్రేస్లెట్ ధరించడం ఉత్తమం. ఈ వ్యాధి బాధితులు రక్తస్రావంతో ఇబ్బంది పడుతుంటే తమ పరిస్థితిని గురించి ఇతరులతో చెప్పలేనప్పుడు ఈ బ్రేస్లెట్ సూచికగా పనిరేస్తుంది. దీన్ని చూసి వాళ్లను అస్పత్రికి తరలిస్తారు. డాక్టర్లు వాళ్లకి ప్రత్యేకంగా ఫ్యాక్టర్ ట్రీట్ మెంట్ ఇస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories