Bitter Gourd: కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టముండదు.. అయినా తింటారు ఎందుకంటే..?

Bitter Gourd Kakarakaya Is Not Liked By Many People But Know Why They Eat It
x

Bitter Gourd: కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టముండదు.. అయినా తింటారు ఎందుకంటే..?

Highlights

Bitter Gourd: చలికాలంలో చాలా రకాల కూరగాయాలు మార్కెట్‌లోకి వస్తాయి. ఇందులో కొన్ని ఈ సీజన్‌లో మాత్రమే ఉంటాయి. ఇలాంటి వాటిని ప్రజలు బాగా ఇష్టపడుతారు.

Bitter Gourd: చలికాలంలో చాలా రకాల కూరగాయాలు మార్కెట్‌లోకి వస్తాయి. ఇందులో కొన్ని ఈ సీజన్‌లో మాత్రమే ఉంటాయి. ఇలాంటి వాటిని ప్రజలు బాగా ఇష్టపడుతారు. అలాగే అన్ని సీజన్‌లో లభించే ఒక కూరగాయ ఉంది. కానీ దానిని అంతగా ఇష్టపడరు. కానీ కచ్చితంగా తింటారు. దానిపేరే కాకరకాయ. కాకరకాయ రుచి చాలా చేదుగా ఉంటుంది. చాలా మందికి చేదు కూర అంటే ఇష్టం ఉండదు. కానీ కొందరికి చేదు అంటే చాలా ఇష్టం. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఎక్కువగా తినే కూరగాయ. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. బలహీనతను తొలగిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. తీగలో పెరిగే ఏకైక కూరగాయ ఇదే. దీని ప్రాథమిక రుచి చేదుగా ఉంటుంది. కాబట్టి ఈ కూరగాయను ఎక్కువగా వాడరు.

కాకరకాయ సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉండటంతో ప్రజలు ఇష్టం లేకున్నా తింటారు. ఇందులో ఉండే ఆరోగ్య సమృద్ధి గుణాలే దీనికి కారణం. కాకర ముఖ్యంగా పొట్టకు చాలా మేలు చేస్తుందని చెబుతారు. కూరను సరిగ్గా వండితే అస్సలు చేదుగా ఉండదు. కాకరకాయ అనేక రంగులు, పరిమాణాలలో కనిపిస్తుంది. దాని పరిమాణం, పొడవు సీజన్ ప్రకారం మారుతూ ఉంటాయి.

చాలా మంది కాకరకాయ కూర వండేటప్పుడు దాని పై భాగాన్ని తీసివేస్తారు. ఎందుకంటే ఇక్కడే చేదు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇదే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రుచిలో చాలా చేదుగా ఉన్నప్పటికీ పొట్టకు సంబంధించిన అన్ని వ్యాధులకు దూరం చేస్తుంది. వాస్తవానికి కాకర భారతదేశంలో పుట్టలేదు. ఇది మొదట ఆఫ్రికాలో కనుగొన్నారు. అక్కడ నుంచి ఇది ఆసియాకు వచ్చింది.

వేసవిలో ఆఫ్రికాలోని కుంగ్ వేటగాళ్లకు ఇది ప్రధాన ఆహారం. ఇది మొదట వారి ప్రాంతంలో కనిపించింది. కాలక్రమేణా దాని ప్రయోజనాలు అర్థం కావడంతో ఇది చాలా దూరం ప్రయాణించి విదేశాలకు చేరుకుంది. కాకరలో మోమోర్టిసిన్ అనే ప్రత్యేక గ్లైకోసైడ్ అనే విష పదార్ధం ఉంటుంది. దీని కారణంగా దాని రుచి చేదుగా ఉంటుంది. అయితే ఇదే మూలకం మన శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫైబర్, విటమిన్ ఎ, బి1 బి2, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, పొటాషియం వంటి పోషకాలు చేదులో లభిస్తాయి. ఈ పోషకాలు కడుపులో పేరుకుపోయిన పురుగులు, అనవసరమైన చెత్తను తొలగించడంలో సహాయపడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories