Rose Water: స్కిన్ గ్లో పెంచే రోజ్ వాటర్

Rosewater: Rose Water to Enhance Skin Glow
x

Rosewater:(ది హన్స్ ఇండియా) 

Highlights

Rose Water: రోజ్ వాటర్ తో చర్మానికి నిగారింపుతో పాటు మంచి గ్లో వస్తుంది.

Rose Water: తన సొగసులతో ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా గులాబీ సొంతం అంటే ఆశ్చర్యం కలగక మానదు. సౌందర్యపోషక ఉత్పత్తుల్లో గులాబీలు లేని ఉత్పత్తి లేదంటే అతిశయోక్తి అంతకన్నా కాదు. సెంట్ల తయారీలో కూడా గులాబీ అగ్రగామి అన్నవిషయం అందరికీ విధి తమే. వాడిపోయినా, వాడిగా ఉన్నా గులాబీ తన రాజసాన్ని మాత్రం కోల్పోదు. వాటితో తయారుచేసే రోజ్ వాటర్ అందులోని సుగుణాలు ఏంటో తెలుసుకుందాం మన "లైఫ్ స్టైల్" లో చూద్దాం.

అన్ని రకాల చర్మ సమస్యలకు రోజ్ వాటర్ చక్కని పరిష్కారం చూపుతుంది. అందగా వుండాలనుకునే వారు ప్రతి ఒక్కరు రోజ్ వాటర్ ను ఉపయోగిస్తుంటారు.చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో రోజ్ వాటర్ తర్వాతే మరేదైనా. రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది. నిగారింపుని తెస్తుంది. రోజ్ వాటర్ ఇంట్లో ఉంటే చాలు.. ఖరీదైనా టోనర్లు, సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములతో అవసరమే ఉండదు.

రోజంతా బయటి పనులతో మనమూ, మనతో పాటూ చర్మం కూడా వడలిపోతుంది. బోలెడంత కాలుష్యం ముఖానికి అంటుకుంటుంది. ఫేస్‌వాష్ చేసుకున్నా సరే.. ఈ మురికి వదలదు. ఇంటికెళ్లాక ముఖాన్ని శుభ్రం చేసుకుని.. కాస్త రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ఫేస్‌ను తుడవండి. చర్మంపై పేరుకున్న వ్యర్థాలన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖం కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

ఎండలో బాగా తిరిగితే చాలు ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. అలాంటప్పుడు రోజ్ వాటర్‌లో కీరదోస రసం, గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమంలో దూది ముంచి మొత్తం శుభ్రం చేయాలి. ట్యాన్ పోతుంది. రోజ్ వాటర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్లకింద నల్లటి వలయాలు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. గులాబీ నీళ్లలో ముంచి దూదిని కళ్ల కింద తరచూ పెట్టుకుంటే ఆ వలయాలు మాయమవుతాయి.

తలలో చుండ్రు తగ్గాలంటే తలకి స్నానం చేశాక ఓ మగ్గు నీటిలో రోజ్ వాటర్ కలిపి మాడుకి తగిలేలా పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది మొటిమలున్న వారు రోజూ గులాబీనీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మరవద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories