Teenage Girls Beauty Tips: టీనేజ్‌ అమ్మాయిలకు బెస్ట్‌ బ్యూటీ టిప్స్‌.. అవేంటంటే..?

Best Beauty Tips For Teenage Girls
x

Teenage Girls Beauty Tips: టీనేజ్‌ అమ్మాయిలకు బెస్ట్‌ బ్యూటీ టిప్స్‌.. అవేంటంటే..?

Highlights

Teenage Girls Beauty Tips: టీనేజ్‌లో అమ్మాయిల్లో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. దీంతో ముఖంపై మొటిమలు, మచ్చలు మొదలవుతాయి. టీనేజ్‌ అంటేనే చర్మం డ్యామేజ్‌ అయ్యే వయసు.

Teenage Girls Beauty Tips: టీనేజ్‌లో అమ్మాయిల్లో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. దీంతో ముఖంపై మొటిమలు, మచ్చలు మొదలవుతాయి. టీనేజ్‌ అంటేనే చర్మం డ్యామేజ్‌ అయ్యే వయసు. దీని నుంచి బయటపడాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ముఖం అంద విహీనంగా మారుతుంది. చాలామంది ఈ సమయంలో మార్కెట్‌లో లభించే బ్యూటీ ప్రొడాక్ట్స్‌ను వాడుతారు. వీటివల్ల అందం ఏమోగానీ సైడ్‌ ఎఫెక్ట్సే ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు సహజసిద్దమైన కొన్ని బ్యూటీ పద్దతుల గురించి తెలుసుకుందాం.

టీనేజ్ అమ్మాయిల్లో హార్మోన్ల మార్పుల వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలు తరచుగా ఎదురవుతాయి. ఈ పరిస్థితిలో మీరు ఎల్లప్పుడూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మురికి పేరుకుపోదు.వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల చర్మం జిడ్డుగా మారకుండా ఉంటుంది. బయటకు వెళ్లినప్పుడల్లా ముఖాన్ని శుభ్రం చేసుకోండి. సన్‌స్క్రీన్ రాయడం మర్చిపోవద్దు. దీనివల్ల సూర్యుడి హానికరమైన కిరణాల నుంచి రక్షించుకోవచ్చు.

ఇంట్లో కొన్ని రకాల బ్యూటీ పేస్టులు తయారుచేసుకోవచ్చు. ఇవి ముఖాన్ని మృదువుగా మారుస్తాయి. అందులో ఒకటి పసుపు పేస్ట్‌. దీనిని వారంలో రెండుసార్లు ముఖంపై అప్లై చేయాలి. దీనివల్ల ముఖంపై పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది. ముఖం ఆరోగ్యంగా అందంగా కనిపించడం ప్రారంభమవుతుంది. అలాగే సరైన డైట్ ఫాలో కావాలి. బయటి వస్తువులను ఎక్కువగా తినకూడదు. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా ఉండేవిధంగా చూసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories