Benefits of Ice Apples: ఈ ఒక్క పండు ..10 గ్లాసుల కొబ్బరి నీళ్లతో సమానం..ఈ పండు ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు

Benefits of Ice Apple If you eat palm fruit, you will get nutrients in 10 glasses of coconut water
x

 Benefits of Ice Apples: ఈ ఒక్క పండు .. 10 గ్లాసుల కొబ్బరి నీళ్లతో సమానం..ఈ పండు ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు

Highlights

Ice Apples: తాటిముంజలు..ఇవి ఎక్కువగా వేసవికాలంలో లభిస్తాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు, దాహాన్ని తీర్చేందుకు ఇదొక్క గొప్ప పండు. ఈ జ్యూసీ పండులో సహాజ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండేందుకు సహాయపడుతాయి. తాటిముంజలో ఆరోగ్యప్రయోజనాలేంటో చూద్దాం.

Health Benefits of Ice Apple : కాలం ఏదైనా సరే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈకాలంలో అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. డెంగ్యూ, చికూన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు విజ్రుంభిస్తాయి. అయితే వర్షాకాలంలో తోపాటు వేసవి కాలంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల డిహైడ్రేషన్ బారిన పడుతుంటారు. అయితే ఈ కాలంలో లభించే తాటిముంజల గురించి అందరికీ తెలిసిందే. ఒక వేసవికాలంలోనే లభించే ఈ తాటిముంజల్లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జ్యూసీ పండు మీ శరీరంలో నీటిశాతాన్ని తగ్గిస్తాయి. ఈ పండును తినడం వల్ల వేసవిలో మీరు ఖచ్చితంగా రిఫ్రెష్‌గా ఉంటారు.

వేసవి కాలంలో లభించే పండు ఇది. ఇది వేసవిలో సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఈ పండును తిన్న తర్వాత, మీరు మండే వేడిలో కూడా చాలా చల్లగా ఉంటారు. ఈ పండు యొక్క స్వభావం చల్లదనాన్ని కలిగి ఉంటుంది. అందుకే దీనిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు. ఈ పండు శరీరాన్ని తాజాగా ఉంచడమే కాకుండా వేడి వల్ల వచ్చే అనేక వ్యాధులను దూరం చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా, ప్రజలు సులభంగా అంటు వ్యాధులకు గురవుతారు. కాబట్టి, మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీరు విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఐస్ యాపిల్ తినవచ్చు.

-తాటిముంజలు మీ శరీరాన్ని చల్లగా, హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడే పండు.

-బరువు, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

-ఈ పండు ద్వారా జీర్ణ సమస్యలు నయమవుతాయి.

- కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

-ఈ పండు దురద, దద్దుర్లు నయం చేస్తుంది.

-గర్భిణులకు పౌష్టికాహారం పుష్కలంగా ఉంటుంది.

తాటి కల్లు:

తాటి పండ్లు కేవలం వేసవి కాలంలోనే లభిస్తాయి. కానీ తాటి కల్లు ఏ సీజన్ లో అయినా లభిస్తుంది. దీన్ని నుంచి వచ్చే నీరు వారానికోసారైనా తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories