Exercising: ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం సరైనదా..కాదా..!

Benefits of Exercising on an Empty Stomach and Side Effects
x

Exercising: ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం సరైనదా..కాదా..!

Highlights

Exercising: ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది.

Exercising: ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. అయితే ఖాళీకడుపుతో ఎక్సర్‌సైజ్ చేయడం సరైనదా కాదా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. నిజానికి ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం రెండంచుల కత్తి లాంటిది. దీనివల్ల సులువుగా బరువు తగ్గుతారు. మరోవైపు వ్యాయామం చేయడం వల్ల డీహైడ్రేషన్,రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. నిజానికి ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల చాలా శక్తి ఖర్చవుతుంది.

అది ఫ్యాట్‌ని కాల్చేస్తుంది. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం కండరాలకు మేలు చేస్తుంది. కండరాలు దృఢంగా మారతాయి. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. వ్యాయామం చేసే వ్యక్తులు ఇతర వ్యక్తుల కంటే తక్కువ అనారోగ్యంతో ఉంటారు. ఇది కాకుండా ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తి బలపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేస్తాయి.

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇది కాకుండా వాంతుల సమస్య ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో వర్కవుట్ చేయడం వల్ల కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే వ్యాయామం చేసే ముందు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలని సూచిస్తున్నారు. ఇది కాకుండా మీరు మిల్క్ షేక్ లేదా బాదం షేక్ కూడా తాగవచ్చు. వ్యాయామానికి ముందు డిటాక్స్ డ్రింక్ తాగడం ఆరోగ్యానికి మంచిదే.

Show Full Article
Print Article
Next Story
More Stories