గుమ్మడి గింజలని డస్ట్‌బిన్‌లో పారేస్తున్నారా.. తప్పు చేస్తున్నట్లే..!

Benefits of Eating Pumpkin Seeds
x

గుమ్మడి గింజలని డస్ట్‌బిన్‌లో పారేస్తున్నారా.. తప్పు చేస్తున్నట్లే..!

Highlights

Pumpkin Seeds: గుమ్మడికాయని ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు.

Pumpkin Seeds: గుమ్మడికాయని ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుమ్మడికాయని ఉడికించడం చాలా సులభం దీని జీర్ణక్రియలో ఎటువంటి సమస్య ఉండదు. అయితే చాలామంది గుమ్మడికాయ గింజలని డస్ట్‌బిన్‌లో పారేస్తారు. ఇది చాలా తప్పు. వాటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. గుమ్మడికాయ గింజలు ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం.

1. టెన్షన్ పోతుంది

ఈ రోజుల్లో పని, కుటుంబం, ఆర్థిక ఒత్తిడి చాలా ఎక్కువైంది. దీని కారణంగా తరచుగా టెన్షన్, డిప్రెషన్‌కు గురవుతారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గుమ్మడి గింజలను తీసుకోవచ్చు. ఎందుకంటే వీటిలో మెగ్నీషియం ఉంటుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా గుమ్మడి గింజలలో ఉండే జింక్, విటమిన్ బి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

2. మంచి నిద్ర

ఈ రోజుల్లో చాలా మందికి నిద్ర తక్కువ అనే సమస్య ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. రాత్రంతా పక్కలు మారుస్తూ ఉంటారు. ఈ పరిస్థితిలో గుమ్మడికాయ గింజలు నిద్రలేమి సమస్యను పరిష్కరిస్తాయి.

3. రోగనిరోధక శక్తి

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి తమని తాము రక్షించుకోవడానికి ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. అయితే గుమ్మడి గింజల్లో విటమిన్ ఈ ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని విపరీంతంగా పెంచుతాయి.

4. మధుమేహ వ్యాధిగ్రస్తులు

షుగర్‌ పేషెంట్లు గుమ్మడికాయ గింజలను తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌లో ఉపశమనాన్ని అందిస్తుంది. మధుమేహానికి దివ్యౌషధం లాంటి ఈ గింజల్లో విటమిన్ సి లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories