Health Tips: ఈ విషయాలలో బీర్​ తాగితే ఆరోగ్యానికి మంచిదే.. అవేంటంటే..?

Benefits Of Drinking Beer Know The Health Problems If You Drink Too Much
x

Health Tips: ఈ విషయాలలో బీర్​ తాగితే ఆరోగ్యానికి మంచిదే.. అవేంటంటే..?

Highlights

Health Tips: బీర్​ తాగడం వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుందని అందరికి తెలుసు. కానీ దీనివల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయని కొద్దిమందికే తెలుసు.

Health Tips: బీర్​ తాగడం వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుందని అందరికి తెలుసు. కానీ దీనివల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయని కొద్దిమందికే తెలుసు. వాస్తవానికి ఆల్కహాల్​ ఆరోగ్యానికి హానికరం. అది ఏ విధంగా తీసుకున్నా నష్టమే జరుగుతుంది. కానీ కొన్నిసార్లు మంచి కూడా జరుగుతుంది. అయితే తక్కువ పరిమాణంలో తీసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది. బీర్​ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బీరు తాగితే కిడ్నీలో ఉండే రాళ్లు పగిలిపోతాయని కొందరు నమ్ముతారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ బీర్ తాగడం వల్ల 3 మి.మీ పరిమాణంలో ఉండే రాళ్లు మాత్రం మూత్రం ద్వారా బయటకు వెళుతాయి. జ్ఞాపకశక్తి మందగించేందుకు కారణమయ్యే అల్జీమర్స్ సమస్యకు బీర్ మంచి నివారణ అని చెప్పాలి. ప్రతి రోజు కొద్దిగా బీర్​ తాగడం వల్ల సమస్యను అధిగమించవచ్చు. రోజూ 75 మి.లీ బీర్ తీసుకోవడం వల్ల అల్సర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

అలాగే బీర్ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. బీర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే రోజుకు 350 మి. లీ కంటే ఎక్కువగా తీసుకోవద్దని సూచిస్తున్నారు. అంతేకాదు బీర్​ తాగడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేసుకోవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. శారీరక దృఢత్వం సాధించడంలో కూడా బీర్ ఉపయోగపడుతుంది. కానీ అతిగా మాత్రం తాగకూడదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories