పరగడుపున ఈ ఆయుర్వేదం డ్రింక్ తీసుకోండి.. బెల్లీఫ్యాట్‌ని తగ్గించుకోండి..

Belly Fat can be Reduced with a Drink made with Jaggery and Lemon | Weight Loss Tips
x

పరగడుపున ఈ ఆయుర్వేదం డ్రింక్ తీసుకోండి.. బెల్లీఫ్యాట్‌ని తగ్గించుకోండి..

Highlights

Belly Fat: వేగంగా పెరుగుతున్న బరువు, ఊబకాయంతో ఇబ్బంది పడుతుంటే ఈ వార్త మీకోసమే...

Belly Fat: వేగంగా పెరుగుతున్న బరువు, ఊబకాయంతో ఇబ్బంది పడుతుంటే ఈ వార్త మీకోసమే. ఒక్క ఆయుర్వేద డ్రింక్‌తో మీరు సులభంగా బెల్లీఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు. ఈ పానీయాన్ని బెల్లం, నిమ్మకాయతో తయారు చేస్తారు. మీరు ఇంట్లో కూడా సులభంగా సిద్దం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం బరువు తగ్గడానికి ఉత్తమమైన మార్గమని అందరికి తెలుసు. కానీ సమయాభావం వల్ల చాలామంది ఎక్సర్‌ సైజ్ చేయలేకపోతారు. కానీ తిండి తినకుండా మాత్రం ఉండలేకపోతారు. ఈ పరిస్థితిలో ఈ ఆయుర్వేద పానీయం మీకు చాలావరకు సహాయం చేస్తుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ బెల్లం పొడిని కలపండి. ఇప్పుడు అందులో ఒక చెంచా నిమ్మరసం కలపండి. ఈ రెండింటినీ బాగా మిక్స్‌ చేసి పరగడుపున తాగండి. బరువు తగ్గడానికి మీరు ఈ పానీయాన్ని ప్రతిరోజు ఉపయోగించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెల్లం జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బెల్లంలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గించే ప్రయాణంలో ఈ రెండు పోషకాలు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

నిమ్మకాయ శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బరువు తగ్గించే ప్రక్రియను మెరుగుపరుస్తుంది. నిమ్మలో ఉండే పాలీఫెనాల్ యాంటీ-ఆక్సిడెంట్లు బరువును సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బెల్లం, నిమ్మరసం జీర్ణ, శ్వాసకోశ వ్యవస్థలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories