Spicy Food: కారంగా ఉండే ఆహారాలు ఇష్టమా.. ఈ అనర్థాలు తెలిస్తే షాక్..!

Be Careful if you Like Spicy Food These Serious Damage can Happen
x

Spicy Food: కారంగా ఉండే ఆహారాలు ఇష్టమా.. ఈ అనర్థాలు తెలిస్తే షాక్..!

Highlights

Spicy Food: భారతదేశం సుగంధ ద్రవ్యాల దేశం. భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలు వివిధ దేశాలకు ఎగుమతి అవుతాయి.

Spicy Food: భారతదేశం సుగంధ ద్రవ్యాల దేశం. భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలు వివిధ దేశాలకు ఎగుమతి అవుతాయి. భారతీయ గృహాలలో సుగంధ ద్రవ్యాలు ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. ఎర్ర మిరపకాయను భారతీయ ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆహారపు రుచిని పెంచుతుంది. అయితే ఇది ఆరోగ్యానికి అంతే హానికరం కూడా. ఎక్కువ కారంగా తినే వ్యక్తులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎర్ర మిరపకాయలను ఆహారంలో ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టమేంటో తెలుసుకుందాం.

1. గుండెల్లో మంట

కారంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఛాతీలో మంట వస్తుంది. దీంతో పాటు కడుపులో కూడా మంటగా ఉంటుంది. కొన్నిసార్లు చికాకు మరింత పెరిగి ఇబ్బందిపెడుతుంది. ఈ సమయంలో వెంటనే డాక్టర్‌కి చూపించాల్సి ఉంటుంది.

2. జీర్ణక్రియ సమస్యలు

ఎర్ర మిరపకాయల కారం ఆహారంలోని పోషకాలను తొలగిస్తుంది. ఇది జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది. జీర్ణక్రియ సమస్య మొత్తం శరీరాన్ని దెబ్బతీస్తుంది.

3. నోటిలో బొబ్బలు

కారం ఎక్కువగా తినడం వల్ల నోటిలో బొబ్బలు వస్తాయి. మీకు ఏదైనా శ్వాసకోశ వ్యాధి ఉన్నట్లయితే ఎర్ర కారం తినడం ప్రమాదకరం. మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల ఆస్తమా, అల్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

4. గర్భిణీ స్త్రీలకు హానికరం

గర్భిణీ స్త్రీలు ఎర్ర కారం తినకూడదు. దీని వల్ల ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. మహిళలతో పాటు వారి బిడ్డ కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories