Bathing: స్నానం చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..!

Bathing Mistakes Do Not Make These Mistakes While Bathing | Bathing Tips for Fair Skin
x

Bathing: స్నానం చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..!

Highlights

Bathing: స్నానం చేసేటప్పుడు చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. అవి మీకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తాయి...

Bathing: స్నానం చేసేటప్పుడు చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. అవి మీకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తాయి. తప్పు సబ్బును ఎంచుకోవడం, బాత్రూమ్ శుభ్రంగా ఉంచకపోవడం లాంటివి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అలాంటివి కొన్ని తెలుసుకుందాం. మీరు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. అప్పుడు శరీరం మృదువుగా తయారవుతుంది. ఆలస్యం అయితే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే శరీరం తేమగా ఉన్నప్పుడే అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

చాలా మంది తలస్నానం చేసేటప్పుడు తమ జుట్టును తరచుగా షాంపూతో రుద్దుతారు. ఇది కొంతమందికి మంచిది కాదు. వాస్తవానికి మీ తల జిడ్డుగా లేనట్లయితే ప్రతిరోజూ షాంపుతో కడగవలసిన అవసరం లేదు. జుట్టును తరచుగా కడగడం వల్ల పొడిగా, నిర్జీవంగా మారుతుంది. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ ఫ్యాన్‌ని ఆఫ్‌లో ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్నానం చేసే సమయంలో బాత్రూమ్ తేమతో నిండిపోతుంది. ఇది క్రమంగా బాత్రూమ్ గోడలను దెబ్బతీస్తుంది. దీని వల్ల బాత్‌రూమ్‌లో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది.

స్నానం చేసిన తర్వాత ఎప్పుడూ తడి టవల్‌ని ఉపయోగించకూడదు. ఎందుకంటే దీంట్లో అనేక రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది. డర్టీ టవల్స్ వల్ల ఫంగస్, దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అన్నింటిలో మొదటిది స్నానం చేస్తున్నప్పుడు ఏ సబ్బుని ఉపయోగిస్తున్నారనేది తెలుసుకోవాలి. ఎందుకంటే తప్పు సబ్బును ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్‌కి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు ఏర్పడుతాయి. అంతేకాదు అతి చల్లటి నీరు కాకుండా అతి వేడి నీరు కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories