Banana Peel: అరటి తొక్కతో ముత్యాల్లాంటి దంతాలు సొంతం

Banana Peel Helps to Get Pearl Like Teeth
x

అరటి పండు

Highlights

Banana Peel: ముత్యాల్లాంటి దంతాల కోసం అరటితొక్కతో ఒక నిముషంపాటు దంతాలపైన వారం పాటు ప్రతిరోజూ రుద్దాలి.

Banana Peel: ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం అరటి పండు. మన కు సాధారణగా దొరికే పండ్లలో అరటి పండు ఒకటి. అరటి పండుని ఎక్కువ మంది రెగ్యులర్ గా తీసుకుంటూనే వుంటారు. అరటి పండులో అనేక పోషకాలు మరియు కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. అరటిపండులో విటమిన్లు B-6, B-12, మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అలాంటి అరటి పండు ని తిని తొక్క పడేస్తూ వుంటాం కదా. అరటి తొక్కలొ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్య పోక తప్పదు. అవేంటే చూద్దాం మన "లైఫ్ స్టైల్" లో

గారపట్టిన దాంతాలతో బాధపడే వారు అరటితొక్కతో ఒక నిముషంపాటు దంతాలపైన ఒక వారం రోజులపాటు ప్రతిరోజూ రుద్దండి. ఇలా చేయటంవలన మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి. పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దండి లేదా ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను కట్టండి. చర్మం కొరకు అరటితొక్కతో చేసే చికిత్సలలో ఇది సులభమైన మార్గం. మొటిమలతో బాధపడేవారు అరటి పండు తొక్కతో ముఖాన్ని ఐదు నిమిషాల పాటు మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల వారం రోజులు మంచి ఫలితం ఉంటుంది.అరటితొక్క మొత్తగా చేసి దానికి గ్రుడ్డు సొనను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద రాసి, ఐదు నిముషాలు రువాత కడగండి. స్కిన్ ప్లోడింగ్స్ నుండి ఉపసమనం కలుగుతుంది.

అరటి తొక్క మాయిశ్చరైజేషన్ గుణాలను కలిగి ఉండడం వల్ల దురదను కూడా తగ్గిస్తుంది. ఇది త్వరగా సోరియాసిస్ ను తగ్గిస్తుంది. దోమకాటు వల్ల దురద మరియునొప్పి నుండి తక్షణం ఉపశమనం పొందాలంటే అరటి తొక్కతో ఆ ప్రాంతంలో మసాజ్ చేయాలి. షూస్, లెదర్, సిల్వర్ పాలిష్: ఏవైనా బూట్లు, తోలు, మరియు రజతం; వీటిని వెంటనే ప్రకాశింప చేయడానికి అరటితొక్కతో రుద్దండి. హానికరమైన UV కిరణాలు నుండి కళ్ళను రక్షించడంలో అరటి తొక్క సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories