Baking Soda Uses: చర్మ సౌందర్యానికి బేకింగ్ సోడా

Baking Soda Uses in Telugu Baking Soda for Skin Whitening Reviews
x

Baking Soda: (File Image)

Highlights

Baking Soda Uses: ఎండ వేడిమి వల్ల కమిలిపోయిన ముఖానికి, శరీరానికి వంటసోడా ఉపశమనం కలిగిస్తుంది.

Baking Soda Uses: బేకింగ్ సోడా లేదా వంటసోడా లేదా సోడా ఉప్పు ఎక్కువగా వంటింట్లో వుండే ఆహార పదార్థం. కానీ మీకు తెలుసా కేవలం వంటల్లోనే కాదు.. సౌందర్య సాధనంగా కూడా చాలా నుండి ఉపయోగిస్తున్నారు. అందులోని క్రిస్టలైన్ కాంపోజిషన్లో గల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు దాని ప్రత్యేకతకు కారణం. ఎవరైనా దాన్ని నిక్షేపంగా తమ సౌందర్యాన్ని ఇనుమడింపచేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెపుతున్నారు. మరి ఇంకా సోడా ఉప్పులో ఎలాంటి ప్రయోజనాలు వున్నాయో మన "లైఫ్ స్టైల్" లో చూద్దాం.

ఎండ వేడిమి వల్ల కమిలిపోయిన ముఖానికి, శరీరానికి అది ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని మృతకణాలను తొలగించడమే కాకుండా నల్లబడిన శరీరాన్ని తెల్లబరిచేందుకు బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. ముఖంపై ఉండే మురికిని తొలగించి మెరిసేలా చేయడంలో వంటసోడా చక్కగా ఉపయోగపడుతుంది. చెంచా సెనగపిండిలో కొన్నిచుక్కల నిమ్మరసం, చిటికెడు వంటసోడా వేసి కొన్ని నీళ్లు పోసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి.

మీ చర్మంపై దద్దుర్లు, పొడిబారిపోవడం వంటివి ఉంటే... తినేసోడాను చర్మంపై రాసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో సన్ బాత్ చేసేవాళ్లు ఇది రాసుకొని చేసుకుంటే... చర్మం కోమలం అవుతుంది.ఫేసియల్స్ కు వెళ్లేంత సమయంలేనప్పుడు వంటింట్లోని బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని నిమ్మరసంతో కలిపి ముఖంపై రాయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. నిద్రకు ముందు దాన్ని డ్రై షాంపూగా కూడా ఉపయోగించుకోవచ్చు.

శరీరంలోని ట్యాన్ ను తొలగిస్తుంది. అంతే కాదు అండర్ ఆర్మ్స్, మోచేతులు, మోకాళ్లపై నలుపును ఇది పోగొడుతుంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాకు సమానంగా నిమ్మరసం కలిపి గట్టి మిశ్రమంగా తయారుచేసి ఆయా ప్రాంతాల్లో సమానంగా రాసి పదినిమిషాల తరువాత కడిగేయాలి. అలా కొంత కాలం చేసి ఫలితం చూడండి. మీరే ఆశ్చర్యపోతారు.

మన దంతాలు మిలమిలా మెరవాలంటే తినే సోడా దోహదపడుతుంది. అది ఎలా అంటే చిటికెడు తినేసోడా తీసుకొని..బ్రష్‌తో దంతాలపై రుద్దుకోండి. దంతాలపై ఉంటే రకరకాల గారపట్టిన రంగులన్నీ పోయి... మిలమిలా మెరుస్తాయి. యాపిల్ సైడెర్ వెనిగర్, తినేసోడా కలిపి తీసుకుంటే... బరువు తగ్గడమే కాదు.. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. కొద్ది పరిమాణంలో తీసుకోవాలి. గుండె మంట లేదా ఎసిడిటీ సమస్య ఉంటే..తినేసోడా బాగా పనిచేస్తుంది. ఇది పొట్టలో యాసిడ్లను తరిమేసి..గుండె మంటను తగ్గిస్తుంది. తినేసోడాను నోట్లో వేసుకొని, నీటితో పుక్కిలించి ఊస్తే... నోట్లోని వైరస్, బ్యాక్టీరియా బయటకు పోతాయి. నోట్లో కాలనీలు పెట్టుకునే అన్ని రకాల క్రిములకూ ఇది శత్రువే. కొన్ని సందర్భాల్లో కొందరి పడకపోవచ్చు. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి వాడుకోవాల్సి వుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories