Health: మీక్కూడా ఈ అలవాట్లు ఉన్నాయా? లివర్‌ పాడవ్వడం ఖాయం

Health: మీక్కూడా ఈ అలవాట్లు ఉన్నాయా? లివర్‌ పాడవ్వడం ఖాయం
x
Highlights

Bad habits that shows side effect on liver health: శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ముఖ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కాలేయం...

Bad habits that shows side effect on liver health: శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ముఖ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కాలేయం పనితీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అయితే మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా లివర్‌ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు, అలవాట్లే లివర్‌ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌ వంటివి లివర్‌ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయిల్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని అంటున్నారు. అలాగే కూల్ డ్రింక్స్‌ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం ప్రమాదంలో పడడం ఖాయమని అంటున్నారు. అందుకే లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి అలవాట్లను తగ్గించుకోవాలని చెబుతున్నారు. ఆయిల్ ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకున్నా కాలేయంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవడం కూడా లివర్‌ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 10, 20 నిమిషాలు ఒక కునుకు తీస్తే పెద్దగా నష్టం ఉండదు కానీ.. గంటల తరబడి నిద్రపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు. పగటిపూట ఎక్కువగా నిద్రపోయే వారిలో లివర్‌ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక నిద్రలేమి కూడా లివర్‌ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. అర్థరాత్రులు ఎక్కువ సేపు మేల్కొని ఉండడం కూడా లివర్‌ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

మానసిక ఆరోగ్యం కూడా లివర్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, హైపర్‌ టెన్షన్‌ కాలేయ పనితీరును ప్రభావితం చేస్తుందని అంటున్నారు. లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని జీవితంలో భాగం చేసుకోవాలి. ఇక పరిమితికి మించి నాన్‌ వెజ్‌ తినే అలవాటు ఉన్న వారిలో కూడా లివర్‌ ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్‌ బారిన పడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

నోట్‌: ఈ సమాచారం ఆరోగ్యంపై ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories