Health Tips: తిన్న తర్వాత ఈ చెడ్డ అలవాటు మానుకోండి.. లేదంటే దంతాలు పాడవుతాయి..!

Avoid Using A Toothpick After Eating Or Else Your Teeth Will Get Damaged
x

Health Tips: తిన్న తర్వాత ఈ చెడ్డ అలవాటు మానుకోండి.. లేదంటే దంతాలు పాడవుతాయి..!

Highlights

Health Tips: చాలామంది తిన్న తర్వాత వెంటనే టూత్‌పిక్‌ వాడే అలవాటు ఉంటుంది. ఇది చాలా చెడ్డ అలవాటు. అంతేకాకుండా దీనివల్ల దంత సమస్యలు ఎదురవుతాయి.

Health Tips: చాలామంది తిన్న తర్వాత వెంటనే టూత్‌పిక్‌ వాడే అలవాటు ఉంటుంది. ఇది చాలా చెడ్డ అలవాటు. అంతేకాకుండా దీనివల్ల దంత సమస్యలు ఎదురవుతాయి. టూత్‌పిక్‌ని ఎక్కువగా వాడటం వల్ల చిగుళ్లు బలహీనమవుతాయి. వాస్తవానికి చెక్కతో చేసిన టూత్‌పిక్ చిగుళ్లకు చాలా నష్టం చేకూరుస్తుంది. దీని కారణంగా రక్తస్రావం జరుగుతుంది. పదే పదే ఉపయోగించడం వల్ల దంతాల మెరుపు తగ్గుతుంది. ఇది దంతాలు చిగుళ్ల సమస్యలను పెంచుతుంది.

దంతాల మధ్య ఖాళీలు పెరుగుతాయి

మీరు తిన్న తర్వాత టూత్‌పిక్‌ని ఉపయోగిస్తే దంతాల మధ్య గ్యాప్‌ పెరుగుతుంది. కొన్ని రోజులకు పండ్ల మధ్యగ్యాప్‌ పెరిగి నలుగురి ముందు నవ్వలేకపోతారు. అంతేకాకుండా ఆహారం దంతాలలో చిక్కుకోవడం వల్ల దంతాలలో కావిటీస్ ఏర్పడుతాయి. తర్వాత దంతాలు క్రమంగా కుళ్లిపోతాయి.

దంతాలు బలహీనమవుతాయి

మీరు టూత్‌పిక్‌ని మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే దంతాల మధ్య గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ వచ్చినప్పుడు తిన్న తర్వాత ఆహారం అందులో ఇరుక్కుపోతుంది. ఇలా జరగడం వల్ల దంతాల ఎనామిల్ పొర తీవ్రంగా దెబ్బతింటుంది. దీంతో క్రమంగా దంతాలు బలహీనపడుతాయి.

చిగుళ్లలో రక్తస్రావం

టూత్‌పిక్‌ని ఉపయోగించడం వల్ల చాలాసార్లు చిగుళ్లకు గాయాలవుతాయి. దీని కారణంగా రక్తస్రావం జరుగుతుంది. టూత్‌పిక్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల దంతాల మూలాలు బలహీనంగా మారుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories