Diwali 2021: దీపావ‌ళి వ‌చ్చేసింది.. ఈ వ్యాధి ఉన్న‌వారు జాగ్ర‌త్త‌..!

Diwali 2021: How Asthma Patients Should Take Care of their Health From Fire Crackers Smoke
x

Diwali 2021: దీపావ‌ళి వ‌చ్చేసింది.. ఈ వ్యాధి ఉన్న‌వారు జాగ్ర‌త్త‌..!

Highlights

* దీపావ‌ళి పండ‌గ‌కి మీ ఇంట్లో ఎవ‌రైనా ఆస్త‌మా పేషెంట్లు ఉన్న‌వారుంటే వారిని దూరంగా ఉండ‌టం మంచిది.

Asthma Patients - Diwali 2021: దీపావ‌ళి పండుగ వ‌చ్చేసింది. అంద‌రు ఎంతో సంతోషంగా ఈ పండుగ‌ని జ‌రుపుకుంటారు. హిందువుల‌కి ఇది ప్ర‌ధాన‌మైన పండుగ‌. ల‌క్ష్మీదేవిని ఆరాధిస్తారు. పిల్ల‌లు, పెద్ద‌లు క‌లిసి టాపాసులు కాలుస్తారు. ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతారు. అయితే ఒక్క విష‌యం మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ పండ‌గ‌కి ఆస్త‌మా పేషెంట్లు మాత్రం దూరంగా ఉండాలి. మీ ఇంట్లో ఎవ‌రైనా ఆస్త‌మా ఉన్న‌వారుంటే వారిని దూరంగా ఉండ‌టం మంచిది. ఎందుకంటే ఈ పొల్యూష‌న్‌కి వారు త‌ట్టుకోలేరు. వ్యాధి తీవ్ర‌త పెరిగి చ‌నిపోయే ప్ర‌మాదాలుంటాయి.

పొగ, క్రాకర్ల శబ్దం కారణంగా ఆస్త‌మా రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే దీపావళి రోజున ఇలాంటి వారు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఏ సమస్య వచ్చినా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. ఎల్లప్పుడు ఇన్‌హేలర్‌ను దగ్గర ఉంచుకోవాలి. అలాగే పొగ పీల్చకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దేశంలో ఆస్తమా రోగులు విపరీతంగా పెరుగుతున్నారు. వీరు దీపావళి రోజు రాత్రి, మరుసటి రోజు ఉదయం కూడా బయటకు వెళ్లవద్దు. ఎందుకంటే ఈ సమయంలో కాలుష్య స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది.

హృద్రోగులు క్రాకర్స్ పేల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాణాసంచా పేల్చినప్పుడు గుండె చప్పుడు వేగంగా పెరిగి ధమనులు కుచించుకుపోతాయి. అటువంటి పరిస్థితిలో గుండె రోగులకు సమస్యలు ఏర్పడుతాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని పటాకులకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే బాణాసంచా పొగ వల్ల పిల్లలకు కళ్లలో సమస్యలు వస్తాయి. అదనంగా వారు తీవ్రమైన అలెర్జీలకు కూడా గురవుతారు. అదేవిధంగా వృద్దులను గమనించాలి. పటాకుల రేణువు ఏదైనా కంటిలోకి పడితే కళ్లని రుద్దకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories