Asthma Alert: ఆస్తమా ఊపిరితిత్తుల వ్యాధి.. కచ్చితంగా ఇవి గుర్తుంచుకోండి..!

Asthma Lung Disease if not Alert Thats all the Things
x

Asthma Alert: ఆస్తమా ఊపిరితిత్తుల వ్యాధి.. కచ్చితంగా ఇవి గుర్తుంచుకోండి..!

Highlights

Asthma Alert: చలికాలంలో వాయు కాలుష్యం వల్ల ఆస్తమా రోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Asthma Alert: చలికాలంలో వాయు కాలుష్యం వల్ల ఆస్తమా రోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ వ్యాధి ఏ వయసు వారినైనా ఇబ్బంది పెడుతుంది. దీని కేసులు చాలా వరకు పిల్లలు, వృద్ధులలో కనిపిస్తాయి. గ్లోబల్ ఆస్తమా రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో దాదాపు ఆరు శాతం మంది పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అదే సమయంలో సుమారు 100 మిలియన్ల మంది ప్రజలు శ్వాస సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధి కారణంగా కొన్ని దేశాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఆస్తమాకు సకాలంలో చికిత్స అందకపోతే అది దీర్ఘకాలిక వ్యాధిగా మారి ప్రాణాంతకంగా మారుతుంది. కాలుష్యం పెరగడం వల్ల ఆస్తమా రోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పేషెంట్లు తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్తమా అటాక్ అవుతుంది. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఆస్తమా కేసులు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

ఆస్తమా ఊపిరితిత్తుల వ్యాధి

ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. దీని వల్ల బాధపడే రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఈ వ్యాధిలో శ్వాసనాళంలో వాపు ఏర్పడుతుంది. దీని కారణంగా ట్యూబ్ పరిధి తగ్గిపోతుంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా లేదా చలి కారణంగా ఆస్తమా పెరుగుతుంది. కాలుష్యం, ధూళి, పొగకు గురికావడం వల్ల ఈ వ్యాధి పెరుగుతుంది. తీవ్రమైన అలెర్జీలు, జన్యుపరమైన కారణాల వల్ల ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతారు.

రెండు మూడు సంవత్సరాల వయస్సులో మాత్రమే పిల్లలలో దీని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అయితే ఎనిమిది నుంచి పదేళ్ల వయస్సులో ఈ వ్యాధి పూర్తిగా పిల్లలలో బయటపడుతుంది. మారుతున్న వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యంలో ఆస్తమా రోగులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక రోగులు ఇన్‌హేలర్‌ను ఎల్లప్పుడూ దగ్గరే ఉంచుకోవాలి. ఇది ఆస్తమా తీవ్రమైన లక్షణాలను నివారిస్తుంది. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి. ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఆహారంలో విటమిన్ ఇ కచ్చితంగా ఉండాలి. దుమ్ము, పొగలు, కాలుష్యం నుంచి దూరంగా ఉండాలి. ఆస్తమా చికిత్స కోసం జరుగుతున్న మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories