Health Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!

Asafoetida Side Effects all Details
x

Health Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!

Highlights

Health Tips: వంటకాల రుచి కోసం భారతీయులు చాలా మసాలలని వినియోగిస్తారు.

Health Tips: వంటకాల రుచి కోసం భారతీయులు చాలా మసాలలని వినియోగిస్తారు. ఈ సంప్రదాయం ప్రాచీనకాలం నుంచి వస్తుంది. ఒకప్పుడు భారతదేశం విదేశాలకు మసాలాలు ఎగుమతి చేసిన దేశం. అందుకే ఇక్కడి వంటకాలలో మసాలాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. లవంగం, యాలకులు, జీలకర్ర, మెంతులు మొదలైన వాటితో పాటు కొత్తిమీర, పుదీన ఆకులని కూడా ఉపయోగిస్తారు. ఇందులో అత్యంత ప్రధానమైనది ఇంగువ. దీనిని సాంబారులో ఎక్కువగా వాడుతారు. అయితే ఇది పరిమిత మోతాదులో వాడితే ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా వాడితే చాలా అనర్థాలు జరుగుతాయి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

సంతానోత్పత్తి సమస్యలు: మహిళలు గర్భధారణ సమయంలో ఇంగువ తీసుకోకూడదు. ఎందుకంటే ఇంగువకు గర్భస్రావం కలిగించే గుణం ఉంటుంది. అందువల్ల ప్రెగ్నెంట్‌ మహిళలు ఇంగువకు దూరంగా ఉండటం మేలు.

చర్మంపై దద్దుర్లు: ఇంగువ తినేవారిలో కొంతమందికి చర్మంపై దద్దుర్లు వస్తాయి. వీరి శరీరం ఇంగువని ఇముడ్చుకోలేదు. అందుకే దూరంగా ఉండాలి. ఒకవేళ దద్దుర్లు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

కండరాల వాపు: ఇంగువను ఆహారంలో తీసుకునే వారిలో చాలా మందికి పెదవులు, మెడ, ముఖంపై వాపులు ఏర్పడుతాయి. అటువంటి వారు ఇంగువకి దూరంగా ఉండాలి.

రక్తపోటు: బీపీ పేషెంట్లు ఇంగువను అధికంగా తీసుకుంటే బీపీ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. కాబట్టి బీపీ పేషెంట్లు ఇంగువకి దూరంగా ఉంటే బెటర్.

Show Full Article
Print Article
Next Story
More Stories