Vitamin E: విటమిన్ ఈ క్యాప్సూల్స్‌ వాడుతున్నారా.. ఈ విషయాలలో జాగ్రత్త..!

Are you Using Vitamin E Capsules do you Know the Side Effects
x

Vitamin E: విటమిన్ ఈ క్యాప్సూల్స్‌ వాడుతున్నారా.. ఈ విషయాలలో జాగ్రత్త..!

Highlights

Vitamin E: మీరు జీవితంలో ఒక్కసారైనా మీ చర్మానికి విటమిన్ ఈ క్యాప్సూల్స్‌ని ఉపయోగించాలి.

Vitamin E: మీరు జీవితంలో ఒక్కసారైనా మీ చర్మానికి విటమిన్ ఈ క్యాప్సూల్స్‌ని ఉపయోగించాలి. విటమిన్ ఈ క్యాప్సూల్ మీ చర్మానికి మాత్రమే కాదు మీ జుట్టుకు కూడా మేలు చేస్తుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది మీ చర్మంపై మెరుపును తీసుకురావడమే కాకుండా జుట్టును బలంగా చేస్తుంది. దీంతో మీరు నల్లటి వలయాలను కూడా తగ్గించుకోవచ్చు. మొటిమల సమస్య ఉన్నవారు తప్పనిసరిగా విటమిన్ ఈ క్యాప్సూల్స్ వాడాలి. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

డార్క్ స్కిన్ మీద ఎలాంటి ఆయిల్ వాడవద్దు. అందువల్ల ఈ క్యాప్సూల్‌ను నేరుగా చర్మంపై ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ కలిగి ఉంటే నేరుగా అప్లై చేయడం మంచిది కాదు.

మీరు కలబందతో ఈ క్యాప్సూల్‌ను ఉపయోగించినట్లయితే చర్మంపై ఎక్కువసేపు ఉంచవద్దు. ఇది మొటిమల సమస్యని మరింత పెంచుతుంది.

వన్ టైమ్ ఫేస్ ప్యాక్ కోసం ఒక క్యాప్సూల్ సరిపోతుంది. మీరు జుట్టు మీద అప్లై చేస్తే రెండు క్యాప్సూల్స్ సరిపోతాయి. ప్రతిసారీ పరిమాణాన్ని గుర్తుంచుకోండి.

విటమిన్ ఈ క్యాప్సూల్స్‌ను ఎప్పుడూ వేడి చేయకూడదు. వాటిని నేరుగా చర్మం లేదా జుట్టు మీద ఉపయోగించకూడదు. దీనిని వేడి చేయడం ద్వారా పోషకాలను కోల్పోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories