మార్నింగ్‌ వాక్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నారా.. ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి జాగ్రత్త..!

Are you Using Mobile Phone During Morning Walk Beware of These Side Effects
x

మార్నింగ్‌ వాక్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నారా.. ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి జాగ్రత్త..!

Highlights

Morning Walk: మన దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది.

Morning Walk: మన దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఈ రోజుల్లో అది లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. కానీ చాలాసార్లు ఇది చెడ్డ వ్యసనంగా తయారైంది. పిల్లల నుంచి పెద్దలవరకు అందరు దీనికి బానిసలుగా మారారు. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మార్నింగ్ వాక్ సమయంలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చాలా తప్పులు జరుగుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. వెన్నుపాముపై ప్రభావం

ఉదయాన్నే వాకింగ్ చేసేటప్పుడు నడుము నిటారుగా ఉంచి నడకపైనే దృష్టి పెట్టాలి. కానీ మీకు తెలియకుండా మొబైల్ వాడటం వల్ల కొద్దిగా వంగాల్సి వస్తుంది. దీనివల్ల వెన్నుపాముపై ప్రభావం పడి శరీర భంగిమ పాడవుతుంది.

2. వెన్నునొప్పి

మార్నింగ్ వాక్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ నోటిఫికేషన్‌లు పదే పదే చూడటం వల్ల శరీరం పొజిజన్‌ మారుతుంది. తర్వాత అది బ్యాక్ పెయిన్‌గా మారుతుంది కాబట్టి సెల్‌ఫోన్‌ను జేబులో పెట్టుకుని నడవడం మంచిది.

3. కండరాలలో నొప్పి

మనం నడిచేటప్పుడు రెండు చేతులను పైకి కిందికి కదపాలి. ఇలా చేయడం వల్ల చేతుల కండరాలకు వ్యాయామం జరుగుతుంది. కానీ ఒక చేత్తో మొబైల్ ఉపయోగిస్తూ మరో చేతిని పైకి కిందికి కదిలిస్తే కండరాల సమతుల్యత దెబ్బతింటుంది. తర్వాత కండరాల నొప్పిగా మారుతుంది.

4. ఏకాగ్రత దెబ్బతింటుంది

మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు దృష్టి మొత్తం వర్కవుట్‌పైనే ఉండాలి. కానీ మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు దృష్టి మరలుతుంది. ఏకాగ్రత క్షీణిస్తుంది. ఏ పని అయినా మనసు పెట్టి చేస్తేనే ప్రయోజనం పొందుతారని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories