Pain Killer: ఈ పెయిన్‌ కిల్లర్‌ అతిగా వాడుతున్నారా.. ప్రమాదంలో పడుతారు జాగ్రత్త..!

Are You Using Meftal Pain Killer Tablet Too Much Government Is Warning
x

Pain Killer: ఈ పెయిన్‌ కిల్లర్‌ అతిగా వాడుతున్నారా.. ప్రమాదంలో పడుతారు జాగ్రత్త..!

Highlights

Pain Killer: కొంతమంది బాడీలో ఏ పెయిన్‌ వచ్చినా వెంటనే పెయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్‌ తెప్పించుకుని వేసుకుంటారు. డాక్టర్ల సలహా అస్సలు తీసుకోరు.

Pain Killer: కొంతమంది బాడీలో ఏ పెయిన్‌ వచ్చినా వెంటనే పెయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్‌ తెప్పించుకుని వేసుకుంటారు. డాక్టర్ల సలహా అస్సలు తీసుకోరు. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. చాలా ఇళ్లలో వివిధ రకాల నొప్పులకు మెఫ్టాల్ టాబ్లెట్‌ ఉపయోగిస్తారు. పీరియడ్స్‌లో తలనొప్పి, శరీర నొప్పి, ఇతర నొప్పుల సమయంలో కూడా ఈ పెయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్‌ వాడుతారు. అయితే ఇండియన్ ఫార్మ కమిషన్ ( IPC) ఈ ఔషధానికి సంబంధించి హెచ్చరికను జారీ చేసింది. మెఫ్టాల్ అధిక వినియోగం డ్రెస్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన అలెర్జీలను పెంచుతుందని తేలింది. దీని ప్రభావం మొత్తం శరీరంపై అలెర్జీ రూపంలో కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి.

పెయిన్ కిల్లర్స్ ప్రమాదకరం

పెయిన్ కిల్లర్స్ ఎల్లప్పుడూ ఆరోగ్యానికి ప్రమాదకరమైనవని వైద్యులు చెబుతున్నారు. తక్షణ ఉపశమనం కోసం తరచుగా మనం వాటిని వాడుతుంటాం. కానీ దీనివల్ల భవిష్యత్‌లో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఎసిడిటీ సమస్య

పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది.పెయిన్‌ కిల్లర్లు మీకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి కానీ దీర్ఘకాలంలో ఇది ఎసిడిటీ వంటి సమస్యలను కలిగిస్తుంది.

కిడ్నీలపై చెడు ప్రభావం

నిపుణుల అభిప్రాయం ప్రకారం చాలా పెయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్లు కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతాయి. ఇవి కిడ్నీల పనితీరుని దెబ్బతీస్తాయి. పెయిన్ కిల్లర్స్ ఎక్కువసేపు వాడటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతుంది.

యాంటీ-రెసిస్టెంట్ థ్రెట్

పెయిన్‌కిల్లర్స్‌ను ఎక్కువగా వాడడం వల్ల యాంటీ రెసిస్టెన్స్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే కొంత కాలానికి ఔషధాలు తీసుకున్నా అవి పనిచేయవు. అందుకే ఏ పెయిన్ కిల్లర్ అయినా డాక్టర్ సలహా లేకుండా అతిగా వాడకూడదని చెబుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories