Neck Wrinkles: మెడపై ముడతల వల్ల ఇబ్బందిగా ఉందా.. ఇలా చేస్తే మళ్లీ నార్మల్‌ స్థితిలోకి..!

Are you Troubled by Wrinkles on Your Neck if You Follow These Tips it will Return to Normal
x

Neck Wrinkles: మెడపై ముడతల వల్ల ఇబ్బందిగా ఉందా.. ఇలా చేస్తే మళ్లీ నార్మల్‌ స్థితిలోకి..!

Highlights

Neck Wrinkles: కొంతమందికి వయసుతోపాటుగా మెడపై ముడతలు వస్తాయి.

Neck Wrinkles: కొంతమందికి వయసుతోపాటుగా మెడపై ముడతలు వస్తాయి. వీటివల్ల చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. మెడపై ముడతలు ఉండటం వల్ల మెడ అందం పాడవుతుంది. అంతేకాకుండా ఈ ముడతలు ఇతర చర్మ సమస్యలకి కారణమవుతాయి. ఈ సమస్యను నివారించాలంటే కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. మెడ ముడతలను నయం చేయడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో ఈరోజు తెలుసుకుందాం.

యాంటీ ఏజింగ్ ఫుడ్స్

యాంటీ ఏజింగ్ గుణాలు లేకపోవడం వల్ల చర్మంపై ముడతల సమస్య మొదలవుతుంది. అందువల్ల ఈ సమస్యను నివారించాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డైట్‌లో యాంటీ ఏజింగ్ ఆహారాలను చేర్చుకోవాలి. ఇవి జుట్టు, చర్మానికి చాలా మేలు చేస్తాయి.

విటమిన్ సి

మెడపై ముడుతలను వదిలించుకోవడానికి విటమిన్ సి ఆహారాలని తీసుకోవాలి. దీనివల్ల మెడపై ముడతలు తొలగిపోతాయి. ఇందుకోసం సిట్రస్‌ జాతి పండ్లని ఎక్కువగా తినాలి. సీజనల్‌ పండ్లపై దృష్టి సారించాలి.

వ్యాయామం

మెడపై ముడుతలను నయం చేయడానికి రోజూ మెడకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. మెడపై రక్త ప్రసరణను మెరుగుపరిచే, కండరాలను బిగుతుగా చేసే వ్యాయామాలు చేయాలి.

చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి

మెడపై ఉండే డెడ్ స్కిన్ ముడుతలకు కారణమవుతుంది. వీటిని వదిలించుకోవడానికి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం అవసరం. దీనివల్ల రంధ్రాలలో పేరుకుపోయిన మురికి, ఆయిల్‌ బయటికి వెళుతుంది.

ఎండకి వెళ్లొద్దు

మెడపై నలుపు, ముడుతల సమస్య తొలగిపోవాలంటే కొన్ని రోజులు ఎండలో తిరగకూడదు. ఎందుకంటే సూర్య కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. ఒకవేళ ఎండలోకి వెళ్లాలంటే ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories