Vitamin Supplements: విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారా... అయితే ఈ విషయాలు గమనించారా..

Are you Taking Vitamin Supplements have you noticed these Things
x

Vitamin Supplements: విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారా...అయితే ఈ విషయాలు గమనించారా..

Highlights

Vitamin Supplements: విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారా... అయితే ఈ విషయాలు గమనించారా..

Vitamin Supplements: ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్స్, మినరల్స్ రెండూ అందాలి. సమతుల ఆహారంలో విటమిన్స్, మినరల్స్ అన్నీ కలగలిపి ఉంటేనే షోషకాహారం అవుతుంది. ప్రపంచంలో ఇప్పుడు అన్ని వయసుల వారు ఫుడ్ సప్లిమెంట్ల రూపంలో విటమిన్ మాత్రలను వాడుతున్నారు. విటమిన్ సప్లిమెంట్లు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తద్వారా మనం పలు అనారోగ్య సమస్యల బారినపడకుండా ఉంటాం. అయితే విటమిన్లు, మినరల్స్ ను వైద్య నిపుణులు సూచించిన మోతాదులో సరైన వ్యవధిలో, సరైన సమయంలో తీసుకోవాలి.

విటమిన్ సప్లిమెంట్లు మన శరీరానికి పడకపోతే కనిపించే లక్షణాలు:

వైద్యుల సూచనల మేరకే విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవాలి. అంతేకాదు వారు చెప్పిన మోతాదులోనే తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయి.

విటమిస్ సి: విటమిన్ సి చాలా సురక్షితమైనదిగా అందరు భావిస్తారు. కానీ డోసేజ్ ఎక్కువైతే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు.

విటమిన్ బి12: విటమిన్ బి12ను కొద్ది మొత్తంలో తీసుకోవాలి. ఈ సప్లిమెంట్ అందరికీ పడదు. ఈ సప్లిమెంట్ తీసుకుంటే తల తిరగడం, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే అది మనకు పడడం లేదని అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యులను సంప్రదిస్తే అవసరమైనవారికి ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు.

ఒమెగా3: ఒమెగా 3 సప్లిమెంట్ మన శరీరానికి పడకపోతే నోటి దుర్వాసన, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. రక్తం పలుచన పడేందుకు ఈ సప్లిమెంట్ వాడుతుంటే అది పడకపోతే రక్తస్రావం కూడా జరిగే ప్రమాదం ఉంది.

ఐరన్: ఐరన్ సప్లిమెంట్ పడకపోతే మలబద్ధకం కనిపించొచ్చు. అలాగే తల తిరగడం వంటి సమస్య కూడా కనిపించొచ్చు. ఐరన్ మోతాదు పెరిగితే హిమక్రోమోటోసిస్ పరిస్థితికి దారి తీస్తుంది.

మొత్తంగా, హెర్బల్ ఔషధాలు, బరువు తగ్గేవి, హార్మోన్ ఆధారిత ఔషధాలతో రిస్క్ లు ఉంటాయి. కాబట్టి వైద్యులను సంప్రదించిన తర్వాతనే సప్లిమెంట్లు తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories