Acidity Relief: అసిడిటీ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా.. వీటిని తీసుకుంటే తక్షణమే ఉపశమనం..!

Are you Suffering From Acidity Problem Take These for Instant Relief
x

Acidity Relief: అసిడిటీ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా.. వీటిని తీసుకుంటే తక్షణమే ఉపశమనం..!

Highlights

Acidity Relief: ఈ రోజుల్లో అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు సర్వసాధారణం.

Acidity Relief: ఈ రోజుల్లో అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు సర్వసాధారణం. పెళ్లికి, పార్టీకి వెళ్లినప్పుడు వేయించిన ఆహారాలు తింటారు. దీని వల్ల కడుపులో గ్యాస్ లేదా మంట సమస్య ఏర్పడుతుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఈ పరిస్థితిలో మీకు మలబద్ధకం లేదా కడుపు నొప్పి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి హాని కలిగించే మందులను ఉపయోగిస్తారు. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలని పాటించవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

పుదీన టీ

ఉదర సమస్యలకు పుదీన టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ ఏర్పడే ప్రక్రియను ఆపుతుంది. బర్నింగ్ సమస్యని ఆపి తక్షణమే ఉపశమనాన్ని అందిస్తుంది. కేవలం ఒక కప్పు నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి మరిగించి తాగాలి. దీనివల్ల వెంటనే ఎసిడిటీ సమస్య నుంచి విముక్తి పొందుతారు.

అల్లం

అల్లం కడుపులో యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. దీని వల్ల అజీర్తి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటిలో కొద్దిగా అల్లం నమలాలి. లేదా గ్లాసునీటిలో అల్లం వేసి మరిగించి దానికి నిమ్మరసం లేదా తేనెను కలిపి తీసుకోవచ్చు. వెంటనే ఉపశమనం లభిస్తుంది.

సోంపు

సోంపు ఒక యాంటిస్పాస్మోడిక్ హెర్బ్ కిందకి వస్తుంది. ఇది గ్యాస్, వికారం మొదలైన సమస్యలలో తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. ఆహారం తిన్న తర్వాత కొద్దిగా సోంపు వేసుకోవాలి. లేదా సోంపు వేసి మరిగించిన నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల రిలాక్స్‌గా ఉంటారు.

నిమ్మకాయ

నిమ్మకాయ ఆల్కలీన్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాన్ని నియంత్రిస్తుంది. గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం దొరుకుతుంది. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories