Health Tips: తరచుగా అలసిపోతున్నారా.. కొంచెం ఈ విషయాలపై శ్రద్ధ పెట్టండి..!

Are You Often Tired Give Some Attention To These Things
x

Health Tips: తరచుగా అలసిపోతున్నారా.. కొంచెం ఈ విషయాలపై శ్రద్ధ పెట్టండి..!

Highlights

Health Tips: ఈ రోజుల్లో చాలా మంది చిన్నచిన్న పనులకే తొందరగా అలసిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.

Health Tips: ఈ రోజుల్లో చాలా మంది చిన్నచిన్న పనులకే తొందరగా అలసిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.. అవును వయసు పెరుగుతున్న కొద్ది శరీరంలో మార్పులు సంభవిస్తాయి. వివిధ రకాల అనారోగ్యాలకి గురవుతారు. థైరాయిడ్, మధుమేహం వంటి వ్యాధులకి గురికొవొద్దంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. తరచుగా అలసటకి గురవుతుంటే కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

షుగర్ తగ్గించండి

40 సంవత్సరాలు వచ్చాయంటే ఆహారంలో చక్కెర శాతాన్ని తగ్గించాలి. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల ఎక్కువగా అలసిపోతారు. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో ఇతర వ్యాధులు చుట్టుముడతాయి. కాబట్టి చక్కెరను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

ఆరోగ్యకరమైన కొవ్వులు తినండి

తరచుగా అలసిపోయినట్లు అనిపిస్తే ఖచ్చితంగా ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులని చేర్చుకోవాలి. ఇవి శక్తికి మూలం. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ల కంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ శక్తిని అందిస్తాయి. ఆహారంలో ఒమేగా 3 అధికంగా ఉండే వాటిని చేర్చుకోవడం ఉత్తమం.

ప్రతిరోజు వ్యాయామం

వయసు పెరిగే కొద్దీ శారీరక శ్రమ తగ్గుతుంది. కానీ ఇలా చేయకూడదు. వ్యాయామం లేకపోవడం వల్ల బద్ధకం వస్తుంది. దీని వల్ల బలహీనత, అలసటగా అనిపిస్తుంది. అందుకే ప్రతిరోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

చెడు అలవాట్లు మానుకోండి

నేటి బిజీ జీవనశైలిలో చాలామంది ఒత్తిడిని జయించడానికి చెడు అలవాట్లకి బానిస అవుతున్నారు. ఎక్కువగా ఆల్కహాల్‌, ధూమపానం చేస్తున్నారు. ఇవి రెండు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. తొందరగా అలసిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి ఈ చెడు అలవాట్లని మానుకుంటే అలసట దూరమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories