Health Tips: ఈ భాగంలో నొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ప్రమాదంలో పడినట్లే..!

Are You Neglecting The Back Pain The Problem Will Increase
x

Health Tips: ఈ భాగంలో నొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ప్రమాదంలో పడినట్లే..!

Highlights

Health Tips: ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గడం వల్ల చాలామంది అనేక వ్యాధుల బారినపడుతున్నారు.

Health Tips: ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గడం వల్ల చాలామంది అనేక వ్యాధుల బారినపడుతున్నారు. కూర్చొని చేసే జాబులు ఎక్కువగా చేయడం వల్ల నడుమునొప్పికి గురవుతున్నారు. ఇది ఒక ధీర్ఘకాలిక వ్యాధి మొదట్లో దీనిని అందరు నిర్లక్ష్యం చేస్తారు. తర్వాత చాలా నొప్పిని అనుభవిస్తారు. ఒకసారి నడుమునొప్పి ప్రారంభమైందంటే చాలా అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ఇది శరీరంలో తీవ్రమైన వ్యాధిగా మారుతుంది.

నిజానికి గృహిణులు ఇంటి పనుల్లో బిజీగా ఉన్నందున ఈ బాధను పట్టించుకోరు. చాలా మంది తప్పుగా కూర్చోవడం, నిద్రపోవడం వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈ నొప్పి దానంతటదే నయమవుతుంది. కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగా మారుతుంది. తీవ్రమైన వ్యాధుల రూపాన్ని తీసుకుంటుంది. అందువల్ల నడుమునొప్పికి సకాలంలో చికిత్స తీసుకోవడం అవసరం. నడుము కింది భాగంలో నొప్పి ఏయే తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

ఆర్థరైటిస్ సమస్య

మీకు నడుము కింది భాగంలో నొప్పి ఉంటే అది ఆర్థరైటిస్‌కు కారణం అవుతుంది. నిజానికి ఆర్థరైటిస్ కారణంగా ఒక వ్యక్తి వెన్నుపాము స్టామినా క్రమంగా తగ్గిపోతుంది. దీనిని స్పైనల్ స్టెనోసిస్ అని కూడా పిలుస్తారు. ఈ నొప్పి మిమ్మల్ని చాలా బాధపెడుతుంది. దీనివల్ల చాలా సార్లు మీరు సరిగ్గా పని చేయలేరు. ఈ పరిస్థితిలో ఈ నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు.

డిస్క్ సమస్య

డిస్క్ వెన్నెముక ఎముకల మధ్య సమతుల్యాన్నికాపాడుతుంది. ఇందులో ఏదైనా ఆటంకం ఏర్పడితే తీవ్రమైన వెన్నునొప్పికి గురవుతారు. డిస్క్ లోపల మృదులాస్థి పైకి రావడం వల్ల అది విరిగిపోతుందనే భయం ఏర్పడుతుంది. దీని కారణంగా నాడిపై చాలా ఒత్తిడి పడుతుంది. డిస్క్‌లు పగిలిపోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. ఈ పరిస్థితిలోడాక్టర్ సలహా అవసరం.

Show Full Article
Print Article
Next Story
More Stories