Cooking Oil: వాడిన వంట నూనె మళ్లీ వాడుతున్నారా.. మీరు చాలా డేంజర్‌లో ఉన్నట్లే..!

Are you heating cooking oil repeatedly but you are at risk of cancer
x

Cooking Oil: వాడిన వంట నూనె మళ్లీ వాడుతున్నారా.. మీరు చాలా డేంజర్‌లో ఉన్నట్లే..!

Highlights

Cooking Oil: మనం ప్రతిరోజు ఇంట్లో కూరలు వండుకోవడానికి, ఇతర ఆహార పదార్థాలు చేసుకోవడానికి వంట నూనె ఉపయోగిస్తాం.

Cooking Oil: మనం ప్రతిరోజు ఇంట్లో కూరలు వండుకోవడానికి, ఇతర ఆహార పదార్థాలు చేసుకోవడానికి వంట నూనె ఉపయోగిస్తాం. అయితే దీనిని ఒక్కసారి వాడితే పర్వాలేదు కానీ కొంతమంది వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఒక్కసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అది విషపూరితంగా మారుతుంది. దీనిని ఉపయోగించడం వల్ల అనారోగ్యాని కి గురికావాల్సి ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) నూనెని తరచుగా వేడిచేయడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి తెలియజేసింది. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

వెజిటెబుల్ నూనెలను తరుచుగా వేడి చేయడం వల్ల అది విషపూరితంగా మారుతుందని, దీనితో చేసిన ఆహారాలు తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోందని ఐసీఎమ్‌ఆర్ వెల్లడించింది. గతంలో జరిగిన పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని తెలిపాయి. వంట నూనెలను పదేపదే వేడి చేయడం వల్ల ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ని పెంచుతుందని ఇది దీర్ఘకాలిక వ్యాధులతో పాటు క్యాన్సర్లకు దారి తీస్తుందని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలోని కొన్ని కొవ్వులు ట్రాన్స్ ఫ్యాట్‌లుగా మారుతాయి. ఇవి గుండె జబ్బులను ప్రేరేపిస్తాయి.

వెజిటెబుల్ ఆయిల్స్‌ని ఒకసారి ఫ్రై కోసం వాడిన తర్వాత దానిని ఫిల్టర్ చేసి కూరలు చేసుకోవడానికి వాడొచ్చు. అయితే మళ్లీ ఇదే నూనెను తిరిగి ఫ్రై చేయడానికి వాడొద్దని ఐసీఎంఆర్ సూచించింది. అదే విధంగా ఈ నూనెను ఒక రోజు లేదా రెండు రోజులు మాత్రమే వాడాలని చెప్పింది. దీనిని చాలా కాలం పాటు స్టోర్ చేసుకోవడం మానేయాలని హెచ్చరించింది. ఎక్కువ కాలం నిల్వ చేస్తే నూనెల క్షీణత దెబ్బతింటుందని తెలిపింది. నూనెను మళ్లీ వేడి చేయడం వల్ల క్యాన్సర్‌లతో పాటు ఇతర వ్యాధుల రిస్క్‌ పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories