Cancer Disease: మీరు రోజు వ్యాయామం చేస్తున్నారా.. లేదంటే క్యాన్సర్‌ ప్రమాదం ఉన్నట్లే..!

Are you Exercising Daily or the Risk of Cancer is Lurking
x

Cancer Disease: మీరు రోజు వ్యాయామం చేస్తున్నారా.. లేదంటే క్యాన్సర్‌ ప్రమాదం ఉన్నట్లే..!

Highlights

Cancer Disease: ఆధునిక కాలంలో క్యాన్సర్‌ అతిపెద్ద ప్రమాదంగా మారింది. ఒకప్పుడు ఈ వ్యాధి యాభై ఏళ్లు దాటినవారికి తక్కువ శాతంలో వచ్చేది. కానీ నేటికాలంలో యువత ఎక్కువగా దీనిబారిన పడుతున్నారు.

Cancer Disease: ఆధునిక కాలంలో క్యాన్సర్‌ అతిపెద్ద ప్రమాదంగా మారింది. ఒకప్పుడు ఈ వ్యాధి యాభై ఏళ్లు దాటినవారికి తక్కువ శాతంలో వచ్చేది. కానీ నేటికాలంలో యువత ఎక్కువగా దీనిబారిన పడుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు రావడం, వ్యాయామం చేయలేకపోవడం, నిశ్చల స్థితిలో ఉండే ఉద్యోగాలు చేయడం వంటివి ముందువరుసలో ఉన్నాయి. ఈ వ్యాధిని చివరి దశలో గుర్తిస్తే రోగి ప్రాణాలను కాపాడటం కష్టంగా మారుతుంది. దీని ప్రారంభ లక్షణాలను ప్రజలు విస్మరిస్తారు లేదంటే వీటి గురించి వారికి తెలియదు. ఈ కారణంగా వ్యాధిని ఆలస్యంగా గుర్తిస్తారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

వ్యాయామం, క్యాన్సర్ కనెక్షన్

చెడ్డ జీవనశైలి, పెరుగుతున్న స్థూలకాయం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో మంట, ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ల అసమతుల్యత వంటి మార్పులు సంభవిస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఉదాహరణకు కొలొరెక్టల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటివి నిశ్చల జీవనశైలికి సంబంధించిన వ్యాధులు. జీవితంలో ఎలాంటి వ్యాయామాలు చేయని వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అయితే వ్యాయామం చేయని వారికి క్యాన్సర్ వస్తుందని కాదు. ఏ విధమైన వ్యాయామం చేయకపోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని అర్థం.

ఈ అలవాట్లను పాటించండి

ప్రతి వ్యక్తి కొన్ని అలవాట్లను పాటించాలి. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ లేదా క్రీడల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాలు చేయాలి. అదనంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. పొగాకు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories