Health Tips: డ్రై ఫ్రూట్స్ అతిగా తింటున్నారా.. ఈ విషయాలు గమనించకుంటే ప్రమాదం..!

Are you Eating too Much Dry Fruits If you Dont pay Attention to These Things it is Dangerous
x

Health Tips: డ్రై ఫ్రూట్స్ అతిగా తింటున్నారా.. ఈ విషయాలు గమనించకుంటే ప్రమాదం..!

Highlights

Health Tips: ఆరోగ్యానికి మంచివే కదా అని వేటిని అతిగా తినకూడదు. దీనివల్ల మంచికి బదులు చెడు జరుగుతుంది.

Health Tips: ఆరోగ్యానికి మంచివే కదా అని వేటిని అతిగా తినకూడదు. దీనివల్ల మంచికి బదులు చెడు జరుగుతుంది. దేనికైనా ఓ లిమిట్‌ ఉంటుంది. దానిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది డ్రైఫ్రూట్స్‌ మంచివని ప్రతిరోజు కావాల్సినన్ని తింటారు. దీనివల్ల శరీరానికి హాని తప్పించి ఎటువంటి ఉపయోగం ఉండదు. డ్రై ఫ్రూట్స్‌ ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినవచ్చా?

రోజూ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. సాధారణంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలను ఆహారం నుంచి పొందలేము. అందుకే డ్రై ఫ్రూట్స్ ద్వారా వీటి లోపాన్ని భర్తీ చేస్తారు. వీటి నుంచి లభించే నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ వాటి అధిక మోతాదు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందువల్ల రోజూ డ్రై ఫ్రూట్స్‌ తింటుంటే నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను మాత్రమే తినండి.

ఎన్ని డ్రై ఫ్రూట్స్ తినాలి

పోషక విలువలను పరిశీలిస్తే పెద్దలు 25 నుంచి 50 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తినాలి. వీటిలో 6-7 గ్రాముల బాదం, నాలుగు జీడిపప్పులు, అర చెంచా పుచ్చకాయ గింజలు, సగం గిన్నె మఖానా, కొన్ని ఎండుద్రాక్షలను తినవచ్చు. పరిమిత పరిమాణంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో పోషకాల లోపం తీరుతుంది.

డైటీషియన్ల సలహా

డైటీషియన్లు మీ శరీరానికి ఎంత డ్రై ఫ్రూట్స్ అవసరమో చెబుతారు. జబ్బులు ఉన్నవారికి వేరే మోతాదు ఉంటుంది. పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అదే సమయంలో ఒక మహిళ గర్భవతి అయితే ఆమె శారీరక స్థితికి అనుగుణంగా తినమని సలహా ఇస్తారు.

దుష్ప్రభావాలు

అధిక మొత్తంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కేలరీలు, కొవ్వు పెరుగుతాయి. అంతే కాకుండా శరీరంలో బ్లడ్ షుగర్ పెరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ తినడంతో పాటు రోజూ తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ సంభవిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories