Health Tips: మూడు పూటలా అన్నమే తింటున్నారా.. ఇక వీటికి సిద్దంగా ఉండండి..!

Are you Eating Rice for three Meals know this Information for Sure
x

Health Tips: మూడు పూటలా అన్నమే తింటున్నారా.. ఇక వీటికి సిద్దంగా ఉండండి..!

Highlights

Health Tips: భారతదేశంలో మూడు పూటలా అన్నం తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది పూర్వకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది.

Health Tips: భారతదేశంలో మూడు పూటలా అన్నం తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది పూర్వకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. అయితే అప్పుడు శ్రమచేసేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అందుకే వారు మూడు పూటలా అన్నమే తినేవారు. కానీ నేటికాలంలో శ్రమ చాలా తగ్గిపోయింది. టెక్నాలజీ పెరగడంతో అన్ని పనులు సులువుగా జరుగుతున్నాయి. ఉద్యోగాలు కూడా చాలావరకు కూర్చొని చేసేవే ఉన్నాయి. దీంతో ఈ జనరేషన్‌ మనుషులు మూడు పూటలా అన్నం తినడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. అన్నం ఎక్కువగా తినడం వల్ల కలిగే దుష్పలితిలను ఈ రోజు తెలుసుకుందాం.

ప్రపంచంలో ఎక్కువ మంది తీసుకునే ఆహారాల్లో అన్నం ఒకటి. వైట్ రైస్ అనేక రకాలుగా వంటలకు వినియోగిస్తుంటారు. బియ్యంతో తయారు చేసిన ఆహార పదార్థాలు తక్షణ శక్తిని అందిస్తాయి. దక్షిణ భారత దేశంలోని వారు అన్నం తినకుండా ఉండలేరు. అయితే అన్నాన్ని ఎక్కువగా తినడం చాలా హానికరం. శరీరానికి తగిన మోతాదులో పీచు అందకపోతే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. పప్పు, కూరగాయలు, గోధుమలు, జొన్నలు, మినుములను భోజనంలో చేర్చుకోవాలి. ఇవన్నీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వైట్ రైస్‌లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి తెల్లన్నం తక్కువగా తినాలి.

వైట్ రైస్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అధిక కేలరీలు తీసుకోవడం వల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. బరువు పెరగడం, రక్తంలో చక్కెర పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇతర ధాన్యాలతో పోలిస్తే వైట్ రైస్‌లో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఈ పోషకాల లోపం వల్ల ఎముకలు, దంతాలు దెబ్బతింటాయి. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. తెల్ల బియ్యం రక్తంలో చక్కెర శాతంను పెంచుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారు వైట్ రైస్ తినకూడదని వైద్యులు చెబుతుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories