Eating Polished Rice: పాలిష్‌ చేసిన బియ్యం తింటున్నారా.. ఈ విషయాలు గుర్తించండి..!

Are you Eating Polished Rice Know About these Side Effects
x

Eating Polished Rice: పాలిష్‌ చేసిన బియ్యం తింటున్నారా.. ఈ విషయాలు గుర్తించండి..!

Highlights

Eating Polished Rice: భారతదేశంలో ఎక్కువ మంది మూడు పూటలా తెల్ల అన్నం తింటారు. ఇది అందరికి మంచిది కాదు. చాలామంది వైద్యులు కూడా ఇదే సలహా ఇస్తుంటారు.

Eating Polished Rice: భారతదేశంలో ఎక్కువ మంది మూడు పూటలా తెల్ల అన్నం తింటారు. ఇది అందరికి మంచిది కాదు. చాలామంది వైద్యులు కూడా ఇదే సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ విషయాన్ని పదే పదే విని ఉంటారు. బరువు తగ్గాలని అనుకునే వ్యక్తులు పాలిష్‌ చేసిన బియ్యంతో వండిన అన్నం, ఇతర పదార్థాలను అస్సలు తినకూడదు. దీనివల్ల ఏం జరుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

నిజానికి బరువు తగ్గాలంటే పాలిష్ చేయని అన్నం తినాలని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే పాలిష్ చేసిన బియ్యం అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు ప్రమాదకరం. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు వైట్ రైస్ తినకూడదు. పాలిష్ చేసిన బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్, బ్లాక్ లేదా రెడ్ రైస్ తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్ సమయంలో పాలిష్ చేసిన బియ్యంలో అన్ని ఖనిజాలు, విటమిన్లు కోల్పోతాయి.

కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అనారోగ్యకరమైనవి. గోధుమ, నలుపు, ఎరుపు బియ్యం అన్ని పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని పాలిష్‌ చేయడం కుదరదు. తెల్లని పాలిష్ చేసిన బియ్యం చాలా ఎక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది డయాబెటిక్ పేషెంట్‌కు చాలా హానికరం. పాలిష్ చేయని బియ్యంలో జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్నాక కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీని కారణంగా అతిగా తినడం మానుకుంటారు. పాలిష్ చేసిన అన్నం తింటే కడుపు త్వరగా నిండదు. దీనివల్ల ఎక్కువ తినాల్సి వస్తుంది. ఆపై వెంటనే బరువు పెరగడం మొదలవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories