Health Tips: ఈ సీజన్‌లో ద్రాక్ష పండ్లను తింటున్నారా.. ఈ విషయాలపై ఓ లుక్కేయండి..!

Are You Eating Grapes This Season Know Whether Green Grapes Or Dried Grapes Are Better For Health
x

Health Tips: ఈ సీజన్‌లో ద్రాక్ష పండ్లను తింటున్నారా.. ఈ విషయాలపై ఓ లుక్కేయండి..!

Highlights

Health Tips: ఈ సీజన్‌లో మార్కెట్‌లో ద్రాక్ష పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ధర కూడా అందు బాటులో ఉంటుంది. ద్రాక్ష తినడం వల్ల శరీరానికి సి విటమిన్‌ ఎక్కువగా లభిస్తుంది.

Health Tips: ఈ సీజన్‌లో మార్కెట్‌లో ద్రాక్ష పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ధర కూడా అందు బాటులో ఉంటుంది. ద్రాక్ష తినడం వల్ల శరీరానికి సి విటమిన్‌ ఎక్కువగా లభిస్తుంది. అయితే ద్రాక్షలో పచ్చి ద్రాక్ష, ఎండిన ద్రాక్ష రెండు ఉంటాయి. దేనికవే ప్రత్యేక గుణాలను కలిగి ఉంటాయి. నార్మల్‌ ద్రాక్ష తీపి, పుల్లని రుచి కలిగి ఉంటుంది. ఎండుద్రాక్ష తియ్యగా ఉంటుంది. దీనిని స్వీట్లు, తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. ద్రాక్షలో 80 శాతం నీరు ఉంటుంది. అయితే ఎండుద్రాక్షలో నీటి శాతం 15 శాతం మాత్రమే ఉంటుంది. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఈ రోజు తెలుసుకుందాం.

ద్రాక్ష కంటే ఎండుద్రాక్షలో కేలరీలు ఎక్కువ ఉంటాయి. వాస్తవానికి ద్రాక్షను ఉడకబెట్టి, ఆరబెట్టి ఎండుద్రాక్ష తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో చక్కెర, యాంటీఆక్సిడెంట్లు కేలరీల రూపంలోకి మారుతాయి. అరకప్పు ద్రాక్ష పండ్లను తింటే కేవలం 30 క్యాలరీలు అదే మోతాదులో ఎండుద్రాక్ష తింటే 250 కేలరీలు శరీరానికి అందుతాయి. ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్‌, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఎండుద్రాక్షలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పేగులోని బ్యాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతాయి.

సాధారణ ద్రాక్షలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ రెండు పోషకాలు చర్మ కణాలను యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది చర్మాన్ని క్యాన్సర్‌కు కారణమయ్యే కిరణాల నుంచి రక్షిస్తుంది. ద్రాక్ష తీసుకుంటే ముఖం నుంచి నల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. రెండు ద్రాక్షలు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. కానీ పచ్చి ద్రాక్ష మరింత ఆరోగ్యకరమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories