Alcohol Effects: అతిగా మద్యం తాగుతున్నారా.. లివర్‌ ఒక్కటే కాదు ఇవి కూడా కంట్రోల్‌ కావు..!

Are You Drinking Too Much Alcohol Not Only The Liver But Also The Emotions Are Not Controlled
x

Alcohol Effects: అతిగా మద్యం తాగుతున్నారా.. లివర్‌ ఒక్కటే కాదు ఇవి కూడా కంట్రోల్‌ కావు..!

Highlights

Alcohol Effects: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలామంది ఈ అలవాటును వదులుకోలేరు.

Alcohol Effects: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలామంది ఈ అలవాటును వదులుకోలేరు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆల్కహాల్‌ తీసుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. ఆడ, మగ అనే తేడాలేకుండా తాగుతున్నారు. యువత చాలామంది దీని బారినపడుతున్నారు. అతిగా మద్యం తాగి ఆరోగ్యం గుళ్ల చేసుకుంటున్నారు. పండుగలు, పబ్బాలు, చావులు ఏ కార్యమైనా ఆల్కహాల్‌ లేకుండా జరగని పరిస్థితి నెలకొంది.

వాస్తవానికి అతిగా మద్యం తాగితే లివర్‌ చెడిపోతుందని అదరికి తెలుసు. కానీ ఇదొక్కటే కాదు శరీరంలో చాలా అవయవాలు దెబ్బతింటాయి. మనిషి రోజు రోజుకు చావుకు దగ్గరవుతుంటాడు. అతిగా మద్యం తాగడం వల్ల ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, పొత్తికడుపు నిండుగా ఉండటం వంటి సమస్యలు ఎదురై చివరికి లివర్ దెబ్బతినడం ఖాయమవుతుంది.

అంతేకాదు అతిగా మద్యం తాగడం వల్ల మైండ్ పై ఎఫెక్ట్‌ పడుతుంది. నిత్యం తాగడం వల్ల ఏకాగ్రతను కోల్పోతారు. చేతులు, పాదాల్లో తిమ్మిర్లు వస్తాయి. జ్ఞాపిక శక్తి తగ్గుతుంది. దీంతో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక నరాల సమస్యలు వస్తాయి. ఒకే సారి రకరకాల డ్రింక్స్ తీసుకుంటే రక్త పోటు పెరుగుతుంది. దీంతో ఎంజైమ్స్ హార్మోన్స్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది. దీనివల్ల ప్యాంక్రియాస్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మద్యపానం వల్ల ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి మద్యం విషయం లో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories