Juices Side Effects: డిటాక్స్‌ పేరుతో ఎక్కువగా జ్యూస్‌లు లాగించేస్తున్నారా.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలుసుకోండి..!

Are You Drinking Too Many Juices In The Name Of Detox Know The Side Effects
x

Juices Side Effects: డిటాక్స్‌ పేరుతో ఎక్కువగా జ్యూస్‌లు లాగించేస్తున్నారా.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలుసుకోండి..!

Highlights

Juices Side Effects: ఆరోగ్యంగా ఉండడం కోసం చాలామంది మంచి డైట్‌ ఫాలో అవుతూ ఉంటారు. ప్రతిరోజు పండ్లు, జ్యూస్‌లు తాగుతూ ఉంటారు.

Juices Side Effects: ఆరోగ్యంగా ఉండడం కోసం చాలామంది మంచి డైట్‌ ఫాలో అవుతూ ఉంటారు. ప్రతిరోజు పండ్లు, జ్యూస్‌లు తాగుతూ ఉంటారు. అయితే ఒక పరిమితి వరకు ఇవి మంచివే కానీ మోతాదు మించి తీసుకుంటే ప్రయోజనానికి బదులు అప్రయోజనాలు ఎదురవుతాయి. బాడీ డిటాక్స్‌ పేరుతో ఇష్టారీతిన జ్యూస్‌లు తాగితే తర్వాత వాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.

ఎక్కువ కేలరీలు

కొన్ని రసాలలో అధిక క్యాలరీ కంటెంట్ ఉంటుంది. పాల ఉత్పత్తులను వీటిలో కలపడం వల్ల కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ జ్యూస్‌లు తాగడం వల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

కడుపు సమస్యలు

ప్రతిరోజూ ఎక్కువ జ్యూస్‌లు తాగితే ఉబ్బరం, గ్యాస్ వంటి కడుపు సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ ఏదైనా జ్యూస్ లేదా డ్రింక్ తాగే ముందు ముందు నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మధుమేహం, బీపీ వంటి సమస్యలున్నప్పుడు వీటివల్ల ప్రయోజనానికి బదులు నష్టాన్ని చవిచూస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories