Lemon Water: పరగడుపున లెమన్‌ వాటర్‌ తాగుతున్నారా.. ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌పై జాగ్రత్త..!

Are you drinking Lemon Water On An Empty Stomach In The Morning Know About The Side Effects
x

Lemon Water: పరగడుపున లెమన్‌ వాటర్‌ తాగుతున్నారా.. ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌పై జాగ్రత్త..!

Highlights

Lemon Water: ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుని తగ్గించుకోవడానికి పరగడుపున లెమన్‌ వాటర్‌ తాగుతున్నారు.

Lemon Water: ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుని తగ్గించుకోవడానికి పరగడుపున లెమన్‌ వాటర్‌ తాగుతున్నారు. దీనివల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది వైద్యులు కూడా ఇలా తాగడాన్ని ప్రోత్సహిస్తారు. కానీ పరగడుపున వేడినీటితో నిమ్మరసం తాగడం వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా తెలుసుకోవాలి లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దంతాలకు హానికరం

పరగడుపున నిమ్మరసం తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. నిమ్మకాయలో అసిడిక్ గుణాలు ఉంటాయి. దీని వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది.

డీ హైడ్రేషన్‌

ఉదయం పూట ఏమీ తినకుండా నిమ్మరసం తాగడం వల్ల చాలామంది డీహైడ్రేషన్‌కు గురవుతారు. నిమ్మకాయలో ఆస్కార్బిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది మూత్రపిండాలలో మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. అందువల్ల సరైన విధంగా మాత్రమే నిమ్మకాయ నీటిని తాగాలి.

ఎముక నష్టం

పరగడుపున నిమ్మరసం తాగడం వల్ల ఎముకలకు హాని కలుగుతుంది. దీనివల్ల ఎముకలలో ఉండే కాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి. తొందరగా విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.

మూత్రం సమస్య

పరగడుపున ఎక్కువగా నిమ్మకాయ నీరు తాగితే మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిమ్మకాయ నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. చాలామంది బరువు తగ్గడానికి ఉదయం పూట దీనిని తీసుకుంటారు కానీ డాక్టర్ సలహా లేకుండా నిమ్మరసం తాగకూడదు. అంతే కాకుండా నిమ్మరసం తాగిన వెంటనే ఎలాంటి పాల ఉత్పత్తులను తినకూడదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories