Teeth Yellow: రోజు బ్రష్‌ చేసిన తర్వాత కూడా పళ్లు పసుపు రంగులో ఉన్నాయా.. మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..!

Are the Teeth Yellow even after Daily Brushing know the Reasons Behind This
x

Teeth Yellow: రోజు బ్రష్‌ చేసిన తర్వాత కూడా పళ్లు పసుపు రంగులో ఉన్నాయా.. మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..!

Highlights

Teeth Yellow: పళ్లు తెల్లగా, అందంగా ఉండటం వల్ల ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. అతడు అందరిలో నవ్వగలడు, అందరితో ఫ్రీగా మాట్లాడగలడు.

Teeth Yellow: పళ్లు తెల్లగా, అందంగా ఉండటం వల్ల ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. అతడు అందరిలో నవ్వగలడు, అందరితో ఫ్రీగా మాట్లాడగలడు.కానీ ఈ రోజుల్లో చాలామంది పసుపు రంగు పళ్లతో బాధపడుతున్నారు. వాస్తవానికి రోజు బ్రష్ చేసినా కొంతమంది పళ్లు పసుపు రంగులోనే ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చాలా సార్లు రోజుకు రెండుసార్లు పళ్లు తోముకుంటే సరిపోదు. దంతాలు పసుపు రంగులోకి మారడానికి చాలా కారణాలు ఉంటాయి. మొదటి కారణం అధికంగా కాఫీ, టీ, రెడ్ వైన్ లేదా సోడా డ్రింక్స్ తీసుకోవడం. మీరు వీటిని నిరంతరం ఉపయోగిస్తే ప్రతిరోజూ పళ్లు తోముకున్న తర్వాత కూడా పసుపు రంగు వచ్చే ప్రమాదం ఉంది. సోడాలో దంతాల పై పొరను తొలగించే రసాయనాలు ఉంటాయి. ఫలితంగా దంతాలపై మరకలు, రంగు మారడం మొదలవుతుంది. దంతాలు పసుపు రంగులోకి మారుతున్నట్లయితే ముందుగా సోడాని కంట్రోల్‌ చేయండి. దీనివల్ల పసుపును కొంతవరకైనా తగ్గించుకోవచ్చు.

దంతాలు పసుపు రంగులోకి మారడానికి ప్రధాన కారణం పొగాకు నమలడం, ధూమపానం చేయడం. మీరు ఈ అలవాట్లను ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది. ప్రతిరోజూ దంతాలను శుభ్రపరచడం మాత్రమే కాదు ఇలాంటి వాటికి దూరంగా కూడా ఉండాలి. ఇది కాకుండా కొన్ని మందులు దంతాల పసుపు రంగుకు కారణమవుతాయి. వీటిలో అధిక రక్తపోటు, కీమోథెరపీ, యాంటీబయాటిక్స్ వంటి మందులు ఉన్నాయి.

కొంతమంది పిల్లల్లో చిన్నప్పటి నుంచే దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి. దీనికి పోషకాల కొరత కారణం కావచ్చు. దీని కారణంగా దంతాల బయటి పొర సరిగా అభివృద్ధి చెందదు. దంతాల వెనుక పసుపు రంగు డెంటిన్ ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ దంతాల బయటి పొర అరిగిపోయినప్పుడు పసుపు రంగు డెంటిన్ కనిపించడం మొదలవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories