Health Tips: ఎముకలు పెళుసుగా మారాయా.. జీవనశైలిలో ఈ మార్పులు చేయండి..!

Are Bones Weakening at a Young Age Make These Changes in Your Lifestyle
x

Health Tips: ఎముకలు పెళుసుగా మారాయా.. జీవనశైలిలో ఈ మార్పులు చేయండి..!

Highlights

Health Tips: ఎముకలలో మార్పులు జరగడం సహజం.

Health Tips: ఎముకలలో మార్పులు జరగడం సహజం. అంటే పాత ఎముకలు కాలక్రమేణా రిపేరు చేయబడుతాయి. ఈ ప్రక్రియ బాల్యంలో, యవ్వనంలో వేగంగా జరుగుతుంది. ఇది ఎముక ద్రవ్యరాశిని పెంచుతుంది. మీకు 30 సంవత్సరాల వయస్సు వచ్చే సమయానికి ఎముక ద్రవ్యరాశి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అంటే ఇకనుంచి ఎముక ద్రవ్యరాశి తగ్గుతుంది. బోలు ఎముకల వ్యాధి అనేది 30 సంవత్సరాలలో మీరు పొందిన ఎముక ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ఎముక ద్రవ్యరాశి వేగంగా తగ్గుతుంది. వృద్ధాప్యం వరకు ఎముకలు దృఢంగా ఉండాలంటే కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

ఎముకల దృఢత్వానికి కాల్షియం చాలా ముఖ్యం. ఎముకలు నిరంతరం విచ్ఛిన్నం, నిర్మాణ ప్రక్రియలో ఉంటాయి. కాబట్టి ఎముకల బలం, నిర్మాణం కోసం కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం. విటమిన్ డి ఎముకలకు కాల్షియం వలె చాలా ముఖ్యమైనది. మీకు సరైన మొత్తంలో కాల్షియం ఉన్నప్పటికీ విటమిన్ డి సహాయం లేకుండా శరీరం దానిని గ్రహించదు. విటమిన్ డి తగినంతగా లభించకుంటే పిల్లలు, పెద్దలలో ఎముకల సాంద్రత తగ్గుతుందని అనేక పరిశోధనలలో తేలింది. అందువల్ల ఈ పోషకాన్ని పొందడానికి ప్రతిరోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో కూర్చోవాలి.

ఎముకల పరిమాణంలో దాదాపు 50 శాతం ప్రోటీన్‌తో కూడిన ఆహారాన్ని తినండి. పరిశోధన ప్రకారం తక్కువ ప్రోటీన్ తీసుకోవడం కాల్షియం శోషణను తగ్గిస్తుంది. ఎముకల నిర్మాణం, విచ్ఛిన్న ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే రెగ్యులర్ గా వెయిట్ బేరింగ్ ఎక్సర్ సైజ్ చేయాలి. దీని కోసం వాకింగ్, జాగింగ్ చేయడం అవసరం. ఇది కాకుండా మెట్లు ఎక్కడం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories