Saliva Benefits: లాలాజలంలో యాంటీ బయాటిక్‌ లక్షణాలు.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Antibiotic Properties in Saliva you Will be Surprised if you Know the Benefits
x

Saliva Benefits: లాలాజలంలో యాంటీ బయాటిక్‌ లక్షణాలు.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Highlights

Saliva Benefits: ఉదయం నిద్ర లేవగానే నోట్లో లాలాజలం ఉండటం అందరు గమనించే ఉంటారు.

Saliva Benefits: ఉదయం నిద్ర లేవగానే నోట్లో లాలాజలం ఉండటం అందరు గమనించే ఉంటారు. చాలా మంది దీనిని చెడుగా భావిస్తారు. కానీ ఈ ఆలోచన సరికాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారి ప్రకారం ఉదయం లాలాజలం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం, గ్లూకోజ్, సోడియం వంటి యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ రోజు లాలాజలం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

లాలాజలం దంతాల రక్షణగా ఉంటుంది. ఇందులో ఫాస్ఫేట్ సోడియం, పొటాషియం, కాల్షియం, గ్లూకోజ్, ప్రోటీన్ వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి దంతాలను బలోపేతం చేస్తాయి. లాలాజలంలో ఉండే యాంటీబయాటిక్ లక్షణాల కారణంగా దంతాలలో ఉండే ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది. దీని కారణంగా దంతాలు కుళ్ళిపోకుండా ఉంటాయి. ఒక విధంగా ఇది దంతాలకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

లాలాజలం కడుపు రుగ్మతలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. దీనికి కారణం ఇందులో ఉండే టైలిన్ అనే ఎంజైమ్. ఉదయాన్నే నిద్రలేచి రోజూ ఒక గ్లాసు నీరు తాగితే ఆ లాలాజలం నీటితో పాటు కడుపులోకి వెళుతుంది. ఇందులో ఉండే టైలిన్ అనే ఎంజైమ్ పొట్టలోకి చేరి పేగులను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

నోటి దుర్వాసనతో బాధపడేవారికి లాలాజలం ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి మనం తిన్న తర్వాత నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకుంటే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అయితే నాలుక ద్వారా ఉత్పన్నమయ్యే లాలాజలం నోటిలోని ఇన్ఫెక్షన్‌ను తొలగించి దుర్వాసనను తొలగిస్తుంది. దీని వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.

కంటిచూపు తగ్గిన వారికి లాలాజలం వరం కంటే తక్కువేమి కాదు. ఉదయాన్నే కాజల్ లాగా లాలాజలాన్ని తీసి కళ్లపై అప్లై చేయడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. దీంతో పాటు కళ్ల కింద ఏర్పడే నల్ల మచ్చలు తగ్గుతాయి. ఇది కంటి నొప్పికి ఉపశమనాన్ని అందిస్తుంది. చర్మ సమస్యలతో బాధపడేవారికి లాలాజలం ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని ముఖంపై పూయడం వల్ల అవన్ని తగ్గుతాయి. ఇది శరీరంలోని గాయాలను మాన్పడానికి కూడా పనిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories