Amla Health Benefits: ఉసిరితో ఇన్ని లాభాలా?

Amla Health Benefits: ఉసిరితో ఇన్ని లాభాలా?
x
Highlights

Amla Health Benefits: ప్రస్తుతం ఉసిరి సీజన్ నడుస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ. దీనిలో యాంటీ...

Amla Health Benefits: ప్రస్తుతం ఉసిరి సీజన్ నడుస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఉసిరిని అత్యంత శక్తివంతమైన పండ్లలో ఒకటిగా పిలుస్తారు. రుచి పుల్లగా, వగరుగా ఉంటుంది. దీనిలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ కాంప్లెక్స్‌తో పాటు ఇతర విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువే.. అందుకే ప్రతిరోజు ఉసిరిని ఏదో ఒకరూపంలో తప్పనిసరిగా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే గోరువెచ్చని ఉసిరికాయ రసం తాగడం అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. ఉసిరి తినడం వల్ల కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

ఉసిరి పోషకాల గని అని అంటుంటారు. జ్యూస్ తాగినా, ఎండబెట్టి వరుగులు చేసినా, పచ్చడి చేసినా, నిల్వ ఉండే ఊరగాయ చేసినా దీనిలోని పోషక విలువలు పదిలంగా ఉంటాయంటున్నారు. వాస్తవానికి ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జలుబు, జ్వరం, ఫ్లూ వంటి చిన్న వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అంతేకాదు, గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

రోజూ ఒక్క ఉసిరికాయ తినడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు వైద్యులు. ఉసిరిలో ఉండే ఫైబర్ సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇంకా మలబద్దకం సమస్యను దూరం చేసి పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. ఉసిరిలో విటమిన్ ఏ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది కళ్లకు చాలా ముఖ్యమైనది. ఉసిరికాయను రోజూ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి శుక్లం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ఉసిరికాయలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు పోషణనిచ్చి అవి రాలిపోకుండా చేస్తాయి. అంతేకాకుండా జుట్టును మందంగా, బలంగా, మెరిసేలా చేస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా వృద్ధాప్యం ఛాయలను తగ్గిస్తుంది.

షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం షుగర్‌ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

గమనిక: ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య అయినా వైద్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories