Ashwagandha: అశ్వగంధలో అద్భుత ఔషధగుణాలు.. ఈ వ్యాధులకి చక్కటి నివారణ..!

Amazing Medicinal Properties of Ashwagandha Provides Great Relief in These Diseases
x

Ashwagandha: అశ్వగంధలో అద్భుత ఔషధగుణాలు.. ఈ వ్యాధులకి చక్కటి నివారణ..!

Highlights

Ashwagandha: ఆయుర్వేదంతో ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చులో బాగుచేసుకోవచ్చు.

Ashwagandha: ఆయుర్వేదంతో ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చులో బాగుచేసుకోవచ్చు. ప్రకృతి మనకు ఎన్నో మూలికలను అందించింది. వాటి సహాయంతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆయర్వేద మందులలో అందరికి గుర్తుకువచ్చేది అశ్వగంధ. దీని ద్వారా చాలా ఆరోగ్య సమస్యలని నయం చేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్‌ మందుల కంటే తక్కువేమి కాదు. దీని సహాయంతో అనేక శారీరక, మానసిక సమస్యలను అధిగమించవచ్చు. అశ్వగంధ ద్వారా ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం.

1. ఒత్తిడిని తగ్గించవచ్చు

అశ్వగంధ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే దీనిని స్ట్రెస్ బస్టర్ అంటారు. అశ్వగంధ సప్లిమెంట్స్ శరీరంలో టెన్షన్ స్థాయిని సాధారణీకరించడంలో సహాయపడతాయి. అలాగే ఒత్తిడి, ఆందోళన కారణంగా వచ్చే గ్యాస్ట్రిక్ అల్సర్‌లను తగ్గించడంలో సహాయపడుతుందని అనేక పరిశోధనలలో తేలింది.

2. పురుషుల శక్తిని పెంచుతుంది

అశ్వగంధ సహజంగా పురుషులలో లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. అశ్వగంధను తీసుకోవడం వల్ల పురుషులలో లిబిడో పెరుగుతుంది.

3. ఆటగాళ్ల సామర్థ్యం పెరుగుదల

ఆటగాళ్లకి అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది. శారీరక బలం, శక్తిని పెంచుతుంది. ఇది అనేక పరిశోధనలలో తేలింది.

4. ఆర్థరైటిస్‌లో ఉపశమనం

ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి అశ్వగంధ ఉపశమనం కలిగిస్తుంది. ఒక అధ్యయనంలో ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 40 మందికి అశ్వగంధ సప్లిమెంట్‌లని అందించారు. మూడు నెలల తర్వాత అధ్యయనంలో పాల్గొనేవారు వారి కీళ్ళలో గణనీయమైన మెరుగుదలని కనుగొన్నారు.

5. ఏకాగ్రత మెరుగ్గా

అశ్వగంధ దృష్టిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మానసిక గణిత సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. అశ్వగంధ సప్లిమెంట్స్ అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories