Immunity Booster: వర్షాకాలంలో ఇవి మీ ఇంట్లో ఉంటే ఎలాంటి జబ్బులు రావు

amazing-health-benefits-of-ginger-adding-your-diet-in-monsoon
x

Immunity Booster: వర్షాకాలంలో ఇవి మీ ఇంట్లో ఉంటే ఎలాంటి జబ్బులు రావు

Highlights

Immunity Booster:కాలం ఏదైనా సరే ఇమ్యూనిటీ పవర్ తప్పనిసరి.అయితే వర్షాకాలంలో మాత్రం ఇంకాస్త ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లు వేధిస్తుంటాయి. మరి ఈసీజన్ లో ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేసుకునేందుకు ఏం చేయలో ఇప్పుడు తెలుసుకుందాం.

Immunity Booster:వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇతర ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం. ఈ సీజన్లో ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టనట్లయితే ఫ్లూ, ఇతర అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే ఈ కాలంలో ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేసుకునేందుకు అల్లం వాడకం తప్పనిసరి. దీంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. అల్లంతో ఇవే కాదు ఇంకెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

ఇమ్యూనిటీ పవర్:

అల్లంలో ఇమ్యూనిటీ పెంచే విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు, బాడీ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. తాజా అల్లంలోని రసాయన సమ్మేళనాలు వ్యాధికారకాలను శానం చేస్తూ..అనారోగ్యాలను దూరం చేస్తాయి. అల్లంలోని జింజెరోల్, షోగోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

ఉదయం అలసటగా ఉంటే:

ఉదయం పూట చాలా మందికి వికారంగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కుంటారు. అయితే అల్లం ఈ సిక్ నెస్ ను తగ్గిస్తుంది. దీన్ని వైద్యుల సలహాతో టాబ్లెట్స్, క్యాండీస్, రియల్ జింజర్ సోడా రూపంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. తాజాగా తురిమిన అల్లంతో టీ చేసుకుని తాగితే ఎంతో ఉపశమనం ఉంటుంది.

ఔషధ గుణాలు:

అల్లాన్ని ఆయుర్వేదం, ఇతర సంప్రదాయవైద్యంలో ఎన్నో ఏండ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇది వికారం, దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలిగిస్తుంది. అల్లంలోని ప్రధాన బయోయాక్టివ్ కాంపౌండ్ జింజెరోల్, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్:

అల్లంలో ఉండే హైడ్రోఅల్కహాలిక్ ఎక్స్ ట్రాక్ట్ రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఇది హెపాటిక్ ఫాస్పోరైలేస్ అనే ఎంజైమ్ ను అడ్డుకుంటుంది. ఈ ఎంజైమ్ కాలేయంలో నిల్వ అయ్యే గ్లైకోజెన్ ను విచ్చిన్నం చేస్తుంది. అయితే ఈ ఎంజమ్స్ ను అడ్డుకోవడం వల్ల గ్లైకోజెన్ విచ్చిన్నం కాకుండా కాపాడుతుంది. అంతేకాదు అల్లం గ్లైకోజెన్ సింథసిస్ మెరుగుపరిచే ఎంజైమ్స్ యాక్టివిటీని పెంచుతుంది.

డైజెస్టివ్ సిస్టమ్:

అల్లంలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు డైజెస్టివ్ సిస్టమ్ లో ఇన్ఫ్లేమేషన్ను తగ్గిస్తాయి. దీంతో డైజెషన్ మెరుగవుతుంది. అల్లం ప్యాంక్రియాటిక్ లైపేస్ అనే ఎంజైమ్ ప్రభావాన్ని కూడా పెంచుతుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అల్లంలో యాంటీ ఇమెటిక్ లక్షణాలు వికారం, వాంతులను తగ్గిస్తుంది.

శ్వాసకోశ సమస్యల నుంచి రిలీఫ్:

వర్షాకాలంలో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అల్లంలోని డీకాంజెస్టెంట్ లక్షణాల కారణంగా శ్లేష్మం పలుచగా ఉంటుంది. దీంతో ముక్కుదిబ్బడ వంటి సమస్యలు రావు. దీంతో శ్వాస తీసుకోవడం మరింత సులభంగా ఉంటుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories