Drum Sticks: మునగతో 300 రోగాలకు చెక్

Amazing Benefits of Drum Sticks
x

Drum Sticks: మునగతో 300 రోగాలకు చెక్

Highlights

Drum Sticks: వయసు పెరిగే కద్దీ కీళ్ల నొప్పులు రావడం సహజమే. కానీ, వయసులో సంబంధం లేకుండా కూడా చాలా మందిని కీళ్ల నొప్పి సమస్యలు వెంటాడుతున్నాయి.

Drum Sticks: వయసు పెరిగే కద్దీ కీళ్ల నొప్పులు రావడం సహజమే. కానీ, వయసులో సంబంధం లేకుండా కూడా చాలా మందిని కీళ్ల నొప్పి సమస్యలు వెంటాడుతున్నాయి. కనీసం 30 ఏళ్లు నిండనివారు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా మని చెప్పడం తరచూ చూస్తున్నాం . దీనికి ప్రధాప్రధాన కారణం మన జీవన ప్రమాప్ర మాణాలే అనడంలో ఎలాంటి సందేహంలేదు . అయితే నోరూరా తింటూనే కీళ్ల సమస్య కు చరమగీతం పాడొచ్చు ..మరి, అది ఎలాగా , ఆదివ్య ఆహారం పేరు ఏంటి...ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుంద్దాం ..

గతంలో 60 ఏళ్లు , 70 ఏళ్లు వచ్చా యంటే మొదలయ్యే సమస్యలు కీళ్ల నొప్పు లు , మోకా ళ్ల నొప్పులు . అయితే ఆధునిక జీవనశైలిలో మార్పులతో ఇప్పుడు మూడు పదుల వయసులో నే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. వయసు పైబడిన వారు లేస్తే కూర్చోలేరు , కూర్చుంటే లేవలేరు . కీళ్ల దగ్గర తగినంత జిగురు లాంటి పదార్థం ఉండకపో వడమే ఇందుకు ప్రధాప్రధాన కారణం . ఆహారపు అలవాట్లు , వ్యాయా మంలేకపోవడం , జన్యు పరిస్థితులు వల్ల చాలా మందికి కీళ్ల నొప్పులు వస్తుంటా యి. కీళ్ల నొప్పులను వైద్య భాషలో ఆర్థరైటిస్ అంటా రు . మనం సాధారణంగా ఆహారంలో ఉప్పుని తీసుకుంటాము . అయితే ఉప్పు అధికంగా తినడం వల్ల మోకాళ్లు , కీళ్లు దగ్గర జిగు రు ఏర్పడకుండా పోతుం ది. దీంతో కీళ్ల మధ్య రాపిడి అనిపించి మోకాళ్లు , కీళ్ల నొప్పులు వస్తా యి. ౩౦ ఏళ్లకు 40 ఏళ్లకే కీళ్ల నొప్పులు వస్తున్నాయంటే ప్రధాన కారణం ఇదే.

మునగతో 300లకు పైగా వ్యాధులు నయం :

రుచికరమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే మనం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం . ఇటు వంటి అద్భుతమైన లక్షణాలు మన కూరగాయల్లో ఉన్నాయి. అలాంటి కూరగాయేము నగ. ఔను , మన దక్షిణ భారతీయులు లొట్టులు వేసుకొని తినే ములక్కాయే. ఈ చెట్టు ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు . చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. ఆకులే కాదు వాటి పువ్వ ల్లో కూడా మంచి ఔషధ గుణాలు కలిగి వున్నాయ. మునగను ఆయుర్వేదంలో అమృతంలా పరిగణిస్తారు . ఎందు కంటే మునగ 300 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేస్తుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో అమృతంలాభావిస్తారు .మునగ కాండం , ఆకులు , బెరడు , పువ్వులు అనేక రకాలుగా ఉపయోగపడతా యి . యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్ఫ్ల మేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మునగలో కాల్షియం , పొటాషియం , జింక్, మెగ్నీ షియం , ఐరన్, కాపర్, ఫాస్ప రస్ వంటి అనేక పో షక ఖనిజాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఫిట్గా ఉంచేందుకు సహాయపడతాయి.

వెయిట్ లాస్ తో పాటు గుండె పనితీరు మెరుగు :

ఆరోగ్యంతోపాటు అధిక బరువును తగ్గించి, పొట్టచుట్టూ పేరు కుపోయిన కొవ్వును కరిగించడంలో మునగాకులు సహాయపడతాయి. అధిక మొత్తంలో పోషకాలు లభించే ఆహార పదార్థా ల్లో మునగా కులు ముందు స్థానంలో ఉంటాయి. మునగ ఆకు బెల్లీ ఫ్యా ట్ను తగ్గించడమే కాదు , రక్తం లో చక్కెరను కూడా నియం త్రిస్తుంది. రక్తంలోని అధిక చక్కెరలను నియంత్రించి శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపుతుంది. మునగ ఆకు లో ఉండే పో షకా లు , యాం టీఆక్సి డెంట్లు శరీరంలో నివాపును తగ్గించడం లో కీలకపాత్ర పో షిస్తాయి. రక్తంలో చక్కె ర, కొవ్వులను నియంత్రించి గుండె పనితీరు మెరుగు పరుస్తుంది. కాలేయం , మెదడు ఆరోగ్యా నికి కూడా సహకరిస్తుంది. నిమ్మ జాతి పండ్ల కంటే మునగాకు లో విటమిన్ సి ఏడు రెట్లు అధికంగా ఉంటుంది. పొటాషియం అరటి పళ్లలో కంటే 15 రెట్లు ఎక్కువగా ఈ ఆకులో ఉంటాయి. ప్రొటీన్లు , విటమిన్ ఎ, కాల్షియం కూడా ము నగాకు ల్లో విరివిగా లభిస్తాయి. రక్తపోటును నియంత్రిం చి, ఆస్టియోపో రోసిస్, ఆర్థరైటిస్, గౌట్స్ లాంటి వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.

మునగతో క్యాన్సర్ కు చెక్ :

అలెర్జీ, ఆస్తమా , శ్వాసకో శ వ్యాధుల ను చి ఉపశమనం కలిగిస్తుంది. కేన్సర్ కణాలతో పోరాడి ముఖ్యంగా గర్భాశయ ముఖద్వా ర, అం డాశయ కేన్స ర్లను నిరోధిస్తుంది. మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది. శరీరంలో నీటి సాంద్రతద్రను సమతా స్థితిలో ఉంచుతుంది. మునగకాయ రసం , కీళ్లనొప్పుల నివారణకు ఎంతగానో దోహదపడుతుంది. ఇందు లో ఉండే విటమిన్ సి మరియు క్యా ల్షియం అందుకు బాగా దోహదం చేస్తుంది. మునగ పువ్వు లు , చిగుర్లు కూరగా వండు కుని తింటే కీళ్ళ జబ్బులు రావు . రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్శా తం పెరిగి ఆరో గ్యాన్ని పెంచుతుంది. ఇక బాలింతలు సైతం తమ డైట్లో మునగను చేర్చుకుంటే తల్లిపాలు పిల్లలకు పుష్కలంగా అందుతాయి. థైరాయిడ్ సమస్యలను కూడా నివారిస్తుం ది. థైరాయిడ్ హార్మో న్ చర్య లను అదుపు లో ఉంచుతుంది. యూరినరీ ఇన్ఫె క్షన్స్ , బ్లడ్ ప్రెజర్, అధిక బరువు , మహిళల నెలసరి సమస్యలకు మునగ చక్క టి పరిష్కారంకా గలదు .

Show Full Article
Print Article
Next Story
More Stories