Mens Health: పురుషుల ఎనర్జీ కోసం ఈ మూడు డ్రై ఫ్రూట్స్‌ సూపర్.. అవేంటంటే..?

Amazing Benefits for Men With These Three Dry Fruits What are They
x

Mens Health: పురుషుల ఎనర్జీ కోసం ఈ మూడు డ్రై ఫ్రూట్స్‌ సూపర్.. అవేంటంటే..?

Highlights

Mens Health: పురుషుల ఎనర్జీ కోసం ఈ మూడు డ్రై ఫ్రూట్స్‌ సూపర్.. అవేంటంటే..?

Mens Health: వివాహం తర్వాత పురుషులు సంతోషకరమైన జీవితం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ కొంతమంది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటంతో తండ్రి కాలేకపోతారు. దీనివల్ల చాలా బాధపడుతారు. నేటి కాలంలో ఇలాంటి పురుషులు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు వెంటనే నిపుణులను సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. అయితే స్పెర్మ్ కౌంట్ పెంచడం కోసం మూడు డ్రైఫ్రూట్స్ బాగా ఉపయోగపడుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. ఎండుద్రాక్ష

ఎండు ద్రాక్షని ఎండబెట్టి తయారుచేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండలో ఎండబెట్టడం వల్ల వీటిలో ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఎనర్జీ, విటమిన్లు ఉంటాయి. అంతేకాదు విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. అయితే డయాబెటిక్ రోగులు మాత్రం పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

2. అత్తి పండ్లు

అత్తిపండ్లని ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలో ఇస్తారు. వీటిని తినడం వల్ల పురుషుల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా పాంతోతేనిక్ యాసిడ్, కాపర్, ఫైబర్, విటమిన్ B6 ఉంటాయి. చాలామంది అత్తి పండ్లను చిరుతిండిగా తింటారు. ఇలా చేయడం ద్వారా వీటి ప్రభావం కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

3. ఖర్జూరాలు

ఖర్జూరాలని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది శుక్రకణాల సంఖ్య, నాణ్యతను పెంచుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. వాస్తవానికి ఎస్ట్రాడియోల్, ఫ్లేవనాయిడ్స్ అనే 3 ముఖ్యమైన సమ్మేళనాలు ఖర్జూరాలలో ఉంటాయి. ఇవి పురుషుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది పురుషుల లైంగిక కోరిక, శక్తిని మరింత మెరుగుపరుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories