Aloe Vera: పట్టులాంటి చర్మం కోసం ఆలోవెరా

Aloe Vera Face Packs For Fair And Radiant Skin
x

Aloe Vera:(File Image)

Highlights

Aloe Vera: అలోవెరాతో పట్టులాంటి చర్మం మీ సొంతం చేసుకోండి

Aloe Vera: ఉరుకులు పరుగుల జీవితంలో సరైన ఆహారం, కంటి నిండా నిద్ర కరువైంది. విపరీతమైన టెన్సన్లతో కాలం వెల్లదీస్తుంటారు కొంత మంది. దీంతో చర్మం కాంతి హీనంగా తయారవుతుంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కొన్ని వ్యాధులు చర్మంపై ప్రభావం చూపుతుంటాయి. అలాంటి సమయం కాంతి వంతమైన చర్మం కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ వుంటారు. అందులో ఒకటి అలోవెరా, పాలమీగడతో ఫేస్ మాస్క్. అదెలానో మన "లైఫ్ స్టైల్" లో చూద్దాం

కాంతివంతమైన మెరిసే చర్మం పౌష్టికాహారంతో పాటు కంటి నిండా నిద్రపోవాలి. వీటికి తోడు ఆలోవెరా ఇంకా పాల మీగడ కలిపి వాడితే మంచి ఫలితం లభిస్తుంది. ఆలోవెరా ముఖ్యంగా కమిలిపోయిన చర్మం, మంటల వల్ల గాయాలు, అలర్జీలు, మంట, మొటిమలని నయం చేయటంలో ఉపయోగపడుతుంది. పాల మీగడకి అందాల పనుల్లో చాలా ముఖ్య పాత్ర ఉంది. పాల మీగడే చర్మ సమస్యలన్నిటికీ, అందానికి ప్రభావవంతగా పనిచేస్తుంది. తయారీ విధానం..రెండు చెంచాల ప్రాసెస్డ్ అలోవీర జెల్ కు 4 చెంచా పాలమీద మీగడను కలిపి మిక్స్ చేయాలి. తరువాత ముఖానికి మాస్క్ వేసుకోవాలి. ఒక గంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసి మెత్తని బట్టతో మొహాన్ని స్మూత్ గా తుడుచుకోవాలి. ఇలా వారానికి ఒకసారి నెల రోజుల పాటు చేస్తూ వుంటే కాంతి హీనమైన చర్మం మృదువుగా తయారవుతుంది. సో పట్టులాంటి చర్మం కోసం ఈ టిప్ ను ఫాలో అవ్వండి. ఫలితాన్ని అనుభవించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories